ఆయన రహస్యాలు ఈయన బయటపెడుతుంటే.. ఆయనకు మండిపోతోంది. ఫ్రస్టేషన్‌తో ఛాలెంజ్ విసిరాడు. ఈయన మాత్రం తక్కువ తిన్నాడా.. నేను రెడీ అంటున్నాడు. పైగా ఈయన ఛాలెంజ్ ఏకంగా సీఎంకే విసురుతున్నాడు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రఘురామకృష్ణరాజుల మధ్య ఇప్పుడు సవాళ్ల పర్వం నడుస్తోంది.
కనపడని నాలుగో సింహమే..
కనపడే మూడు సింహాలు, కనపడని నాలుగో సింహం అన్నట్లు.. వైసీపీలో విజయసాయిరెడ్డి, సజ్జల, వైవీ సుబ్బారెడ్డిలు కనపడే సింహాలు..కనపడని నాలుగోది పెద్దిరెడ్డి. కాంగ్రెస్ నుంచి లేటుగా వచ్చినా.. జగన్‌కి ముందు బ్యాక్ బోన్‌గా తర్వాత పిల్లర్‌గా,, ఆ తర్వాత స్లాబ్‌లా ఇప్పుడు.. అసలు బిల్డింగ్ కూడా కొట్టేసేట్టు కనపడుతున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అవును.. జగన్ పాదయాత్ర నుంచి ఎన్నికల వరకు డబ్బుల వ్యవహారమంతా పెద్దిరెడ్డే చూసుకున్నాడని అంటారు. అంటే ఆ రేంజ్‌లో పెట్టుబడి పెట్టాడు మరి.. ఎక్స్‌పెక్టేషన్స్ మామూలుగా ఉండవుగా. ప్రాఫిట్ రావాలిగా మరి.
ముందు ఇసుక పాలసీ పేరుతో..
అందుకే మైన్స్ మినిస్ట్రీ పట్టేశాడు. ముందు ఇసుక పాలసీ పేరుతో కథ మొదలెట్టారు. ఈ కథ కంచికి చేరే సరికి.. పెద్దిరెడ్డి ఖజానాలోకి భారీగా డబ్బులు వచ్చి పడ్డాయి. ఇప్పటికీ వచ్చి పడుతూనే ఉన్నాయి. ఇక గనుల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. ఏ గని లీజుదారుడిని కదిలించినా ఇప్పుడు బోరుమంటున్నాడు. కమీషన్ ఇచ్చి వ్యాపారం చేసుకునేవారంతా ఇప్పుడు కమీషన్ తీసుకుని.. వ్యాపారం వదిలేసుకోవాల్సిన పరిస్ధితికి చేరుకున్నారు. అందుకే బావురుమంటున్నారు. ఇక చిత్తూరు జిల్లాలో ఈ పెద్దారెడ్డి.. సారీ పెద్దిరెడ్డి హవా మామూలుగా లేదు. ప్రతి గ్రామం.. ప్రతి సందు కూడా ఆయన కనుసైగతో కదలాల్సిందే. సొంత పార్టీలోని రోజాలాంటి నోరున్న నేతలు కూడా నోర్మూసుకుని రాజకీయం చేసుకోవాల్సిన పరిస్ధితి కల్పించాడు. లోకల్‌గా అన్న మాఫియా ఏ రేంజ్‌లో ఉంటుందో లోకల్ వాళ్లని టచ్ చేస్తే తెలిసిపోతుంది.
ఏకంగా జగన్ ప్లేసులోకి..
అలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ వెనక కాకుండా.. ఏకంగా జగన్ ప్లేసులోకి రావాలనుకుంటున్నాడనేది టాక్. సపోజ్.. పర్ సపోజ్ జగన్ జైలుకెళ్లాల్సి వస్తే.. భారతి కాదు… పెద్దిరెడ్డే సీఎం అని కథనాలు వస్తున్నాయి. ఇది నిజమేనని రఘురామకృష్ణరాజు కుండబద్ధలు కొట్టీ మరి చెప్పాడు. దాంతో శివాలెత్తిన పెద్దిరెడ్డి అసలు రఘురామ రిజైన్ చేసి గెలవమనండి చూద్దాం అంటూ సవాల్ విసిరాడు. నేను రాజీనామా చేసి పోటీ చేస్తా.. మరి గెలిస్తే.. జగన్ మొత్తం అసెంబ్లీ రద్దు చేసుకుని ఎన్నికలకు రెడీ అవుతాడా అని ఈయన ప్రతి సవాల్ విసిరాడు.
అలా ఒక రకంగా పెద్దిరెడ్డి పేరు మార్మోగుతుంటే.. ఆ మోతను మరోరకంగా వినిపిస్తున్నారు రఘురామకృష్ణరాజు. దీంతో సొంత పార్టీలోనే అనుమానపు చూపులు ఎదుర్కోవాల్సి వస్తోంది పెద్దిరెడ్డికి. ఆయనపై వస్తున్న కథనాల్లో ఎంత నిజముందో తెలియదు గాని.. పెద్దిరెడ్డి మాత్రం ఎంబ్రాసింగ్ సిట్యయుషన్‌లో పడిపోయాడు.