‘ఎఫ్ 3’లో హనీ ఈజ్ ది బెస్ట్ అంటూ ఊరించి ఉబ్బించిన మెహ్రీన్ ఇక పెళ్లి కూతురు కాబోతోంది. ఆమె నిశ్చితార్థం జరిగింది. తెలుగు, తమిళ భాషల్లో మెహ్రీన్ చాలా సినిమాలే చేసింది. ఆమె భవ్య బిష్ణోయ్ తో చాలా కాలంగా ప్రేమలో ఉంది. ఎట్టకేలకు తన ప్రియుణ్ణే వివాహం చేసుకోడానికి ఆమె నిశ్చయించుకుంది. వీరి నిశ్చితార్థం నిన్ననే జరిగిపోయింది. జైపూర్ లోని ఓ కోటలో విరి నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ ఫొటోలను ఆమె సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఈ వివాహానికి సంబంధించి గతంలోనే వార్తలు వచ్చాయి.

ఇక వరుడి విషయానికి వస్తే అతను హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ కి మనవడు. ఈ ఏడాది చివరలో ఆమె వివాహం జరగనుందట. తన ప్రేమ వ్యవహారం గురించి ఆమె లాక్ డౌన్ సమయంలోనే ప్రకటించింది. సినిమాల్లో అవకాశాలు బాగా వస్తున్న ఈ తరుణంలో పెళ్లి చేసుకోవడం మంచిది కాదన్న అభిప్రాయంతో ఆమె పెళ్లిని వాయిదా వేస్తూ వస్తోందట. ఎట్టకేలకు ఈ ప్రేమ వ్యవహారానికి ఒక ముగింపు వచ్చేసింది. తెలుగులో ఎక్కువగా అనిల్ రావిపూడి సినిమాలతోనే ఆమెకు అనుబంధం ఉంది.

మొదటగా నాని చిత్రం ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ ద్వారా తెర పరిచయమైంది. ఆ తర్వాత మహానుభావుడు చేసింది. రాజా ది గ్రేట్, ఎఫ్ 2 చిత్రాల్లో దర్శకుడు అనిల్ రావిపూడి ఆమెకు చోటు కల్పించారు. ఇప్పుడు ఎఫ్ 3లోనూ ఆమె నటిస్తోంది. ఈ సినిమా చకచకా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షూటింగ్ కాగానే ఆమె ఫ్రీ అయిపోతుంది. పెళ్లి తర్వాత సినిమాలు చేయాలా వద్దా అన్నది మాత్రం ఇంకా నిర్ణయించుకోలేదట.
Must Read ;- టీమిండియా క్రికెటర్ బుమ్రా పెళ్లి.. వధువు విషయం సీక్రెట్!











