పార్టీ అండగా ఉంటుంది .. భయపడకండి!
ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్ పై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. అశోక్ బాబు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడారు. పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. తప్పుడు కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని, న్యాయ పోరాటం చేస్తామని చంద్రబాబు తెలిపారు. అలానే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అశోక్ బాబు కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడారు. కనీసం సమాచారం ఇవ్వకుండా ఇంటికి వెళ్తున్న మార్గం మధ్యలో ఆపి అరెస్ట్ చేసి తీసుకెళ్లారని లోకేశ్ కు అశోక్ బాబు సతీమణి వివరించారు. ఇలాంటి అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ఉండాలని లోకేశ్ చెప్పారు. పార్టీ అన్నివిధాలుగా అండగా ఉండి, న్యాయపోరాటం చేస్తోందని లోకేశ్ భరోసా ఇచ్చారు.
న్యాయపోరాటానికి దిగిన టీడీపీ.. హైకోర్టులో పిటిషన్ దాఖలు
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ను దురుద్దేశపూర్వకంగా అరెస్ట్ చేశారని టీడీపీ న్యాయపోరాటానికి దిగింది. జగన్ రెడ్డి ప్రభుత్వం కావాలనే సీఐడీతో పాత తప్పుడు కేసును తిరగతోడాలని చూస్తోందని పార్టీ నేతలు ఆరోపింస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం టీడీపీ హైకోర్టును ఆశ్రయించింది. బెయిల్ మంజురు చేయాలని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను న్యాయం స్థానం కూడా అనుమతించింది. మధ్యాహ్నం 2.15 గంటలకు పిటిషన్ విచారణకు హైకోర్టు అనుమతించింది.
Must Read:-పల్నాడులో అధికారపార్టీ కండకావరం..! టీడీపీ లక్ష్యంగా దాడులు!!











