రామారావు జీవితం భావి తరాలకు ఆదర్శమని టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఎన్టీఆర్ ఘాట్‌లో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు జాతికి వారసత్వ సంపద, ఆచణకు సాధ్యంకాని పనులు సైతం చేసి చూపించి చరిత్రల్లోకి ఎక్కని మహానేత అని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎన్టీఆర్ లో దేవుడిని చూసుకున్న రోజులు ఉన్నాయని కొనియాడారు.
ప్రతి తెలుగువాడు గర్వించేలా
‘‘ప్రతి తెలుగువాడు గర్వించేలా సినీ, రాజకీయ రంగాలలో ఒక అసాధారణ చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ విశ్వవిఖ్యాతుని ఆదర్శాలను, ఆశయాలను మననం చేసుకుంటూ… ప్రజాసేవలో స్ఫూర్తిని పొందుదాం. తిరుగులేని ఆ ప్రజా నాయకుని స్మృతికి నివాళులర్పిద్దాం’’ అంటూ చంద్రబాబునాయుడు ట్వీట్ కూడా చేశారు.
Must Read ;- అన్ని వర్గాలకు ప్రాణం పోసిన మహానాయకుడు ఎన్టీఆర్ : నారా లోకేశ్
ప్రతి తెలుగువాడు గర్వించేలా సినీ,రాజకీయ రంగాలలో ఒక అసాధారణ చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ విశ్వవిఖ్యాతుని ఆదర్శాలను, ఆశయాలను మననం చేసుకుంటూ… ప్రజాసేవలో స్ఫూర్తిని పొందుదాం.తిరుగులేని ఆ ప్రజా నాయకుని స్మృతికి నివాళులర్పిద్దాం(2/2)
— N Chandrababu Naidu (@ncbn) May 28, 2021