అక్రమ అరెస్ట్‌లతో బయపెట్టాలని చూస్తున్నారు..
అక్రమ అరెస్ట్‌లతో తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులను బయటపెట్టాలని చూస్తున్నారని పార్టీ సీనియర్ నాయకులు ఆగ్రహం వక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్ ను ముక్తంకంఠంతో ఖండించారు. అశోక్ బాబును తక్షణమే విడుదల చేయాలని గుంటూరు సీఐడీ కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పోలీసులు అడ్డుకుని, ఆందోళన చేస్తున్నపలువురు తెదేపా నేతలను పోలీసులు అరెస్ట్ చేసి, నగరంపాలెం పోలీసు స్టేషన్ కు తరలించారు. దీంతో గుంటూరు కోర్టు లైన్ తెదేపా నిరసనలతో అట్టుడికిపోతోంది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లింది! ఇప్పటికే అశోక్ బాబుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, సంబంధించి డాక్యుమెంట్స్ ను, సాక్ష్యాలను సిద్ధం చేస్తోంది సీఐడీ. పూర్తి ఆధారలతో కోర్టులో ప్రవేశపెట్టాలని భావిస్తోంది! మరోవైపు అశోక్ బాబును కలుసుకునేందుకు దేవినేని ఉమతో పాటు పలువురు తెదేపా నేతలు సీఐడీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అయితే అశోక్ బాబును కలిసేందుకు పోలీసులు అనుమతులు నిరాకరించారు. దీంతో పోలీసులకు, తెదేపా నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఉమతో పాటు తెదేపా నేతలు కోవెలమూడి రవీంద్ర, బుచ్చిరాం ప్రసాద్, పిల్లి మాణిక్యాలరావు, సుఖవాసి, కనపర్తిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అశోక్‌బాబు పై థర్డ్ డిగ్రీ..
సీఐడీ అదుపులో ఉన్న అశోక్‌బాబుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని తెదేపా నేతలు అనుమానం వ్యక్తం చేశారు. గతంలో ఎంపీ రఘురామ పై కూడా ఇలానే థర్డ్ డిగ్రీ ప్రయోగించి, చేయని నేరాన్ని కోర్టులో ఒప్పుకోవాలని సీఐడీ ఒత్తిడి తీసుకొచ్చిందని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినా.. విమర్శించినా.. అరెస్ట్ లు చేసి వేదించడం అమానుషమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Must Read:-పల్నాడులో అధికారపార్టీ కండకావరం..! టీడీపీ లక్ష్యంగా దాడులు!!