చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ పిటిషన్ ను వెకేషన్ బెంచ్ కు మారుస్తు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. స్కిల్ కేసులో బెయిల్ కావాలని హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం చంద్రబాబు న్యాయవాదుల అభ్యర్ధనల మేరకు పిటిషన్ విచాణను వెకేషన్ బెంచ్ కు బదిలీ చేసింది ధర్మాసనం.
చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై దసరా సెలవుల్లో విచారణ చేపట్టాలని నిర్ణయించిన హైకోర్టు.. ఆయన ఆరోగ్య పరిస్ధితిపై జైలు అధికారులు నివేదిక ఇవ్వాలని వెకేషన్ బెంచ్ ఆదేశించింది. హై కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ ను వెకేషన్ బెంచ్ కు బదిలీ చేయగా.. రిమాండ్ ను నవంబరు 1వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రబాబు తరుఫున సీనియర్ సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. 40 రోజులుగా చంద్రబాబు జైల్లోనే ఉన్నారు. కేసులో ఎటువంటి పురోగతి లేదన్నారు. ఆయన ఆరోగ్య పరిస్ధితి రోజురోజుకు దారుణంగా పడిపోతోందన్నారు. వెంటనే బెయిల్ ఇచ్చి.. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న హైకోర్టు..పిటిషన్ విచారణను వెకేషన్ బెంచ్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
అలానే రేపు సుప్రీం కోర్టులో స్కిల్ కేసు క్వాష్ పిటిషన్ తీర్పు రిజర్వ్డ్ లో ఉంది. అది శుక్రవారం విడుదలయ్యే అవకాశం ఉంది. అలానే ఫైబర్ గ్రిడ్ కేసు బెయిల్ పిటిషన్ విచారణను కూడా సుప్రీం ఇప్పటికే కేసుల జాబితాలో లిస్ట్ చేసింది. దీనిపై కూడా తీర్పు రేపు విడుదలై అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.