రాజే దొంగైతే.. ప్రజాధనానికి దిక్కెవ్వరు అన్న చందంగా ఏపీలో పాలన కొనసాగుతోంది. ఈ నేపధ్యంలోనే గడిచిన నాలుగునరేళ్ళుగా మానవ వనరులు.., సహజ వనరులు దారుణంగా దోపిడికి గురయ్యాయి. హరిత ట్రిబ్యునల్ హెచ్చరించినా.. కోర్టులు మొట్టికాయలు వేసినా.. అన్నీంటిని పక్కకు తోసి.. యథేచ్చగా ఇసుకును మెక్కేస్తున్నారు.. మట్టిని మింగేస్తున్నారు.
ఏపీలో గత నాలుగునరేళ్ళులుగా ప్రజలకు ఇసుక సహజ పద్దతిలో అందుబాటులోకి రాక.. ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. ఇసుకను బ్లాక్ చేసి దాదాపు 50 వేల కోట్లను దన్నుకున్నారని జగన్ రెడ్డిపై విపక్షాలు ఆరోపిస్తున్నాయి. గతంలో తెలుగు దేశం ప్రభుత్వ హయంలో ఇసుకను ఉచితంగా అందించారు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు. తద్వారా ప్రజలు పెద్ద సంఖ్యలో నిర్మాణాలు చేపట్టారు. రియల్, నిర్మాణ రంగాలు వృద్ధిని సాధించాయి. వీటికి అనుబంధ రంగాలన్నీ పుంజుకుని లాభాలు బాట పట్టాయి. ఉద్యోగ, ఉపాధి సృష్టి జరిగింది. తద్వారా రాష్ట్రంలో ప్రత్యక్ష్యంగా.., పరోక్షంగా దాదాపు 3 లక్షల 50 వేల కోట్ల వ్యాపారం జరిగింది అన్నది ట్రేడ్ యూనియన్స్ చెబుతున్న లెక్కలు. వీటిపై పన్నుల రూపంలో వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకు వచ్చి చేరింది. పైసా ఖర్చులేకుండా సహజంగా తయారయ్యే ఇసుక వనరును స్వేచ్ఛగా వాడుకునేలా ప్రజలకు ఉచితంగా అందిస్తే.. ఎంత వ్యాపారం జరిగిందో.. తద్వారా ఏ స్థాయిలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందో పూర్తి లెక్కలు ఇప్పటికీ నెట్టింట్లో ఉండనే ఉన్నాయి.
ఇంత చిన్న లాజిక్ ను మిస్సైన జగన్ రెడ్డి అధికారాంతంలో కూడా ఇసుక పై యావ తగ్గడంలేదు. ఇంకా నీచ క్రీడకు తెరతీస్తున్నారు. తెర ముందు ఢిల్లీలో ఓ కంపెనీని తీసుకొచ్చి.. తెరవెనుక తమ్ముడు అనిల్ రెడ్డిని పెట్టి ఇసుక తవ్వకాలకు తెరతీస్తున్నారు. ఆ అమ్మకాలపై వచ్చే డబ్బును నేరుగా తాడేపల్లి ప్యాలెస్ కు తరలించేందుకు ఇంకా కుటీలయత్నాలు చేస్తున్నారు. ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ స్టే ఇచ్చినా.. దీన్ని సుప్రీం సమర్ధించినా.. ఇంకా ఇసుకవైపు వంకర పద్దతిలో సరిహద్దులు దాటించి జగన్ రెడ్డి సొమ్ముచేసుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.