విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం చౌడుపల్లి గ్రామానికి చెందిన మాజీ సైనికుడు తన ఏడాదిన్న చిన్నారికి కేజీహెచ్ కు అంబులెన్సులో తీసుకువచ్చారు. చిన్నారికి కరోనా సోకడంతో సీరియస్ గా మారింది. దీంతో చిన్నారికి స్థానికంగా వైద్యం చేయించారు. చిన్నారి ఆరోగ్యం సీరియస్ గా మారడంతో మాజీ సైనికుడు చిన్నారిని అంబులెన్సులో ఆక్సిజన్ పెట్టి కేజీహెచ్ కు మెరుగైన వైద్యం కోసం వచ్చారు. ఆసుపత్రి బయట మూడు గంటలు పడిగాపులు కాసినా వైద్యులు కనికరించలేదు. బెడ్లు ఖాళీలేవనే సమాధానం వచ్చింది. చివరకు ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు.
మూడు గంటల్లో బెడ్లు కేటాయించాలి
కరోనా రోగులకు బెడ్లు కొరత లేదని సీఎం ప్రకటిస్తున్నా క్షేత్ర స్థాయిలో ఇందుకు విరుద్దంగా ఉంది. గంటల తరబడి ఆసుపత్రుల బయట బెడ్లు దొరక్క కరోనా రోగులు, వారి కుటుంబసభ్యులు నానా యాతన పడుతున్నారు. కేవలం విశాఖపట్నంలోనే కాదు, విజయవాడ, గుంటూరు, నెల్లూరు నగరాల్లోనూ బెడ్లు దొరక్క కరోనా రోగులు ఆసుపత్రులు బయటే ప్రాణాలు కోల్పోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
Must Read ;- కరోనా మృతుల లెక్కలు దాచగలరేమో కానీ.. పవన్ కళ్యాణ్