మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే.. గాడ్ ఫాదర్ మూవీని సెట్స్ పైకి తీసుకువచ్చారు. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఇది మలయాళంలో విజయం సాధించిన లూసీఫర్ మూవీకి రీమేక్. అయితే… ఈ కథను తెలుగు నేటీవిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించనున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
అయితే.. చిరు గాడ్ ఫాదర్ మూవీలో గెస్ట్ రోల్ చేసేందుకు సల్మాన్ ఓకే చెప్పారు. అంతే కాకుండా ఈ సినిమాలో చిరంజీవితో కలిసి ఓ పాటలో స్టెప్పులు వేయనున్నారు. ఇది తెలిసినప్పటి నుంచి గాడ్ ఫాదర్ మూవీ పై మెగా అభిమానుల్లోనే కాకుండా సామాన్య ప్రేక్షకుల్లో సైతం మరింత క్యూరియాసిటీ పెరిగింది. గాడ్ ఫాదర్ తాజా అప్ డేట్ ఏంటంటే.. సల్మాన్ టీమ్.. చిరంజీవి, గాడ్ ఫాదర్ బృందంతో నిరంతరం టచ్ లో ఉన్నారు. జనవరి చివరి నాటికి సల్మాన్ – చిరంజీవి ఈ యాక్షన్-ప్యాక్డ్ పొలిటికల్ థ్రిల్లర్ కోసం కలుస్తారని తెలుస్తోంది.
సల్మాన్ చిరుతో కలిసి హైదరాబాద్ లో ఒక వారం పాటు షూటింగ్ చేయనున్నారని సమాచారం. సల్మాన్ ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కోసం 5 నుండి 7 రోజులు కేటాయించారు. సల్మాన్ సీన్స్ ను బాగా గొప్పగా డిజైన్ చేశారని టాక్. సల్మాన్ ఎంట్రీతో గాడ్ ఫాదర్ ను పాన్ ఇండియా ఫిల్మ్ గా ప్రమోట్ చేసేందుకు ఉపయోగపడుతుందని అంచనా. మరి.. గాడ్ ఫాదర్ మూవీని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తారేమో చూడాలి.











