యువత సినిమాతో వెండితెరకు డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు పరశురామ్. ఆ తర్వాత ఆంజనేయులు, సోలో, సారొచ్చారు, శ్రీరస్తు శుభమస్తు వంటి చిత్రాలతో ఆకట్టుకున్నాడు. ఆతర్వాత విజయ్ దేవరకొండతో పరశురామ్ తెరకెక్కించిన గీత గోవిందం సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. చిన్న సినిమాగా రూపొందిన గీత గోవిందం 100 కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం దర్శకుడు పరశురామ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కిస్తున్నారు.
కీర్తి సురేశ్ హీరోయిన్‌గా చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. మహేష్ బాబు ఇటీవల మోకాలికి సర్జరీ చేయించుకోవడం.. కరోనా రావడంతో షూటింగ్ కి బ్రేక్ పడింది. ఫిబ్రవరిలో తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు. ఏప్రిల్ 1న ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమా తర్వాత స్టార్ హీరోలతో భారీ మల్టీ స్టారర్‌ను ప్లాన్ చేశాడట పరశురామ్.
ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మళ్లీ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించనున్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఆ ముగ్గురు హీరోలు ఎవరు..? అనేది ఆసక్తిగా మారింది. అసలు ప్రచారంలో ఉన్న ఈ వార్త వాస్తవమేనా..? కాదా..? అనేది తెలియాల్సి ఉంది.











