దేశ రాజకీయాల్లో మార్పులు చూస్తారంటు వ్యాఖ్యు లు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్ర కే చంద్రశేఖర్ రావు ఫామ్ హౌస్ కు చేరారు. గత వారం పది రోజులుగా ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులతో మంతనాలు జరిపిన ఆయన ఆతర్వాత సంచనంగా మారుతారని అందరు ఊహించారు. కానీ కర్ణాటక లో పర్యటించి తిరిగి వచ్చిన ఆయన మళ్లీ ఫాం హౌస్ కు చేరడం తో విమర్శలు వినిపిస్తున్నాయి.
దేశ రాజకీయాల్లో మార్పులు రావాలంటు గంతలో సంచనల వ్యాఖ్యులు చేసిన తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ ఆ తర్వాత ఫెడరల్ ఫ్రంట్ కొద్ది మంది రాజకీయ నేతలో సమావేశం నిర్వహించారు. తన ఆలోచనలు, మనసులో మాటలను పంచి వారిని తన తో జతకట్టేందుకు రంగం సిద్దం చేశారు. కాలం గడిచిన తర్వాత ఫెడరల్ ఫ్రెండ్ కనుమరుగైంది.
కేంద్రం లో అధికారం చేపట్టిన బీజేపీ రాష్ట్రాల పై చిన్నచూపు చూస్తుందంటు ఇప్పుడు మరోసారి కేంద్ర రాజకీయాల్లో నిలిచారు. అందులోభాగంగానే ఉత్తరాదిలోని కొందరు ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులను కలిసి పలు అంశాల పై చర్చించారు. ఆ పర్యటన అర్దాంతరం గా ముగించుకొని హైదరాహబాద్ కు వచ్చిన ఆయన దక్షిణాది నేతల తో చర్చించేందుకు వెల్లారు. ఒక్కరోజు పర్యటన లో మాజీ సీఎం లకు కలిసి తిరిగి హైదరాబాద్ కు చేరుకున్నారు,నేరుగా ఫాం హౌస్ కు వెల్లిపోయారు. అటు ఉత్తర, ఇటు దక్షిణ రాష్ట్రాల్లో పర్యటన తో అలిసిపోయారని విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రాన్న పాలించేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రగతి భవన్ ను నిర్మించారు, అది కేవలం పేరుకు మాత్రమే ప్రగతి భవన్ గా నిలిచిందన్న అపవాదు కూడా ఉంది.
పర్యటనల పేరుతో ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తున్న సీఎం కేసీఆర్ తీరు చూస్తే తన స్వలాభం కోసం మాత్రమే వాడుకుంటున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మది రాష్ట్రం లో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రజా ధనాన్ని ఖర్చు చేసిన దాఖాలు లేవు.కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి తర్వాత
సీఎం గా కేసీఆర్ రెండు మార్లు పదవీ బాధ్యతలు చేపట్టి కోట్ల రూపాయలు కేవలం పర్యటనలు మాత్రమే వినియోగించడాన్నిప్రజలు తీవ్రంగా తప్పుపడుతున్నారు.
దేశానికి ప్రధానిగా కేసీఆర్ పనిచేయాల్సిన ఆవసరం ఉందని టీఆర్ఎస్ శ్రేణులు ఆశిస్తున్నారు.అందులో భాగంగానే దేశ వ్యప్తంగా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్యనేతలతో చర్చులు నిర్వహిస్తున్నారను తెలుస్తోంది. ఇది ఇలాఉంటే దేశానికి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు త్వరలోనే రానున్నాయి. వాటి పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అందుకోసం బీజేపీయేతర పార్టీలతో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించినట్లు సమాచారం వినిపిస్తుంది. ఉత్తర భారతదేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ ములాయం సింగ్ అఖిలేష్ యాదవ్, శరత్ పవార్, దక్షిణ భారత దేశం లో మాజీ ప్రధాని దేవేగౌడ,మాజీ సీఎం కుమారస్వామి ఇతరులను కలుపుకొని దేశ రాజకీయాల్లో కి వెల్లేందుకు మార్గం వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఏమేరకు సఫలం అవుతుందన్నది మాత్రం తెలియదు. విభజన తర్వాత ధని రాష్ట్రం గా పేరుగాంచిన తెలంగాణ రాష్ట్రం లో ఖజానా విచ్చలవిడిగా ఖర్చు చేసారు.ప్రాజెక్టులు,పథకాలు అంటు అప్పుల పాలు చేశారు. మరి దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ ప్రవేశించి దేశానికి ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టితే దేశ ఆర్థిక పరిస్థితి ఏమవుతుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. నిజానికి కేసీఆర్ కేంద్రం రాజకీయాల్లో కి వెల్లుతారా లేక రాష్ట్రానికి పరిమితం అవుతారన్నది ప్రశ్నార్థంగా మారింది.