నటసింహ బాలకృష్ణ మరోమారు మాస్ చిత్రం తో అభిమానుల మందుకు రానున్నారు. ఇప్పటికే అఖండ, క్రాక్ చిత్రం లో విజయపరంపరాను సాగిస్తున్న హీరో పవర్ పుల్ మాస్ హీరోగా మంచి మార్కులు కొట్టేస్తారని తెలుస్తోంది. అందుకు బంధంచిన చిత్ర నిర్మాణం శరవేగంగా సాగుతోంది.
నటసార్వభౌముడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పుట్టిన రోజు సందర్బంగా బాలకృష్ట నిటిస్తున్న చిత్రం ఫస్ట్ లుక్ ఫోస్టర్ ను విడుదల చేశారు. అందులో భయంకరమైన కనిపిసున్న బాలకృష్ణ చేతిలో కత్తి పట్టుకుని ఆకత్తి రక్తంతో తడిసిపోవండా చూస్తేనే అర్థం చేసుకోవచ్చు. కాగా ఈ చిత్రనిర్మాణం 40% పూర్తి చేసుకుందని మేకర్స్ సంతృప్తిని వ్యక్తం చేశారు. త్వరలోనే చిత్రానికి సంబంధించి ట్రైలర్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
లైట్ గా గడ్డం మరియు మీసాలతో బాలకృష్ణ…. యంగ్ మరియు డాషింగ్ గా కనిపిస్తున్నారు. బ్యాగ్రౌండ్ లో ఒక టెంపుల్ మరియు జనాల గుంపును గమనించవచ్చు. NBK107 లో అధికంగా యాక్షన్ ఎక్కువగా ఉంటుందని చిత్ర నిర్మాతలు తెలిపారు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని తనకు ఇష్టమైన హీరో బారకృష్ణ తో కలిసి చేయడం ప్రత్యేకం. తొలిసారిగా నటసింహం తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని వివరించారు. మరో వైపు ఈ చిత్రం పై భారీ హిట్ కొట్టుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బాలకృష్ణ మరోసారి మాస్ క్యారెక్టర్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారని చెప్పుకుంటున్నారు.
ఈ చిత్రానికి పేరుకారారు కాలేదు. చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల సమయానికి పేరు పై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ చిత్రం లో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా శృతిహాస్ నటిస్తుంది. కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్ గా నటిస్తుండగా.. కోలీవుడ్ విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ , ప్రముఖ మలయాళ నటుడు లాల్ -,నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. చంద్రిక రవి స్పెషల్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాన్నున్నారు. థమన్ అందిస్తున్న సంగీతం ప్రత్యేక ఆకర్శనగా నిలుస్తుందిని చిత్ర యూనిట్ తెలిపారు.