ఇంటిపక్కనో, వీధిలోనో ఎవరికైనా కరోనా సోకిందంటే.. హడలెత్తిపోతాం. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. మాస్కు పెట్టుకుంటాం.. కచ్చితంగా సోషల్ డిస్టన్స్ పాటిస్తాం. మరి అలాంటప్పుడు కోవిడ్ వార్డులోకి వెళ్లాల్సి వస్తే.. ‘అమ్మో.. మనకెందుకులే’ దారిదాపుల్లోకి కూడా వెళ్లం. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ గాంధీ ఆస్పత్రిలోని కొవిడ్ వార్డును క్షుణ్ణంగా పరిశీలించారు. కనీసం పీపీఈ కిట్ ధరించకుండానే గంటసేపు గడిపారు. కరోనా రోగులకు దగ్గరికి వెళ్లి ధైర్యం చెప్పారు. వాళ్లను మర్యాదపూర్వకంగా పలుకరించారు. కేసీఆర్ పీపీఈ కిట్ లేకుండానే కరోనా రోగులను పలకరించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘నేను విన్నాను..నేను ఉన్నాను’ అంటూ కేసీఆర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.
Must Read ;- గాంధీలో సీఎం : కరోనా రోగులకు ధైర్యం చెప్పిన కేసీఆర్