తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో సీఎం కేసీఆర్ బుధవారం గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. దాదాపు 40 నిమిషాల పాటు ఆస్పత్రిలోని కీలక వార్డులను పరిశీలించారు. కరోనా రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. కరోనా ఎమర్జన్సీ వార్డు, ఓపీ, ఐసీయూ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం స్వయంగా కరోనా రోగులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. కరోనా రోగులకు డాక్టర్లు అందిస్తున్న చికిత్స తెలుసుకొని, డాక్టర్లతో పాటు సిబ్బందిని అభినందించారు. కరోనా కిట్స్, ఆక్సిజన్ సరఫరాపై ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
పీపీఈ కిట్ లేకుండానే…
కొవిడ్ వార్డు అంటేనే చాలామందికి భయం. కానీ సీఎం కేసీఆర్ పీపీఈ కిట్ లేకుండా కోవిడ్ వార్డులోకి వెళ్లారు. కేవలం మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించి రోగులకు దగ్గరికి వెళ్లారు. కొంతమంది రోగులను పలకరించారు. సీఎం వెంట మంత్రి హరీశ్ రావు, సీఎస్ సోమేశ్, ఇతర అధికారులు ఉన్నారు. అంతకుమందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గాంధీని విజిట్ చేశారు. పీఎం కేర్స్ తో అందించిన ఆక్సిజన్ ప్లాంట్స్ పై సమీక్ష జరిపారు.
Must Read ;- PPE కిట్ వేసుకోకుండా : కరోనా రోగులను పరామర్శించిన కేసీఆర్!