రైతుకేది ఆపన్న హస్తం..??
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు రైతును అతలాకుతలం చేస్తున్నాయి. పంటలకు భారీ ఎత్తున నష్టం వాటిల్లింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాలో లక్షల హెక్టార్లలో పంటలు నష్ట్పం వాటిల్లింది. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతాలతో మిర్చి, కాటన్ కు వైరస్ సోకి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. వేలాది ఎకరాలు పత్తి, మిర్చి నాశనమైంది. జెమినీ వైరస్ తెగులు సోకి మిర్చి పంటను రైతులు పీకేస్తున్నారు. రైతును ఆదుకొని, పంటలకు పరిహారం అందించాల్సిన ప్రభుత్వం నేటికి ఎటువంటి స్పందించడం లేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఇన్పుట్ సబ్సిడీ అంటే ఏమిటో రైతులు ఎరగరు! ఎకరాకు లక్షల్లో పెట్టుబడి పెట్టి .. నేడు రైతు రోడ్డున పడ్డాడు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం రైతు పట్ల వివక్ష చూపితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఆదుకోకుంటే ఆత్మహత్యే శరణ్యమని వేడుకుంటున్నారు. ఇప్పటికైన కనికరిచండి మొండి జగన్ రెడ్డి గారు అని ఎంతో దీనంగా ప్రాధేయపడుతున్నారు రైతులు!
చంద్రబాబు అధ్యక్షతన రైతులను ఆదుకునేందుకు అడుగులు ..!
పెద్ద ఎత్తున పంటలు నష్టపోయి ..సర్వ కోల్పోయిన రైతుకు వెన్నదండుగా నిలిచేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు శ్రేణులకు పిలుపునిచ్చాడు. నష్టపోయిన రైతులను ఆదుకుని, పంట నష్ట పరిహారం అందించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆదేశించారు. దీంతో తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నెల 18, 19, 20 తేదీల్లో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాలో కమిటీ పర్యటించి రైతులకు భరోసా ఇవ్వనున్నారు. నివేదిక తయారుచేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి, పరిహారాన్ని అందించేలా చూడాల్సిన బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు.
Must Read ;- ఏపీకి ఇక ముగ్గురు సీఎంలు..! మార్చడం ఆ దేవుడు తరం కూడా కాదు..!!