అసలేం జరిగింది ….
కడప జిల్లాలో మొత్తం 50 మండలాల్లో సగటు అత్యధిక వర్షపాతం నమోదైయింది. దీనికి తోడు తిరుపతితో సహా చిత్తూరు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో శేషాచల పర్వతశ్రేణికి వెనువైపు భారీ వర్షాలు కురిశాయి. అక్కడి వరద నీరంతా .. చెయ్యేరు నది పరీవాహక ప్రాంతానికి రావడం మొదలైంది. మరోవైపు పీలేరు, రాయచోటిలో కూడా అధిక వర్షం కురిసింది. ఇదంతా కొన్ని గంటల్లోని జలఖడ్గం మాదిరిగా వర్షించిన వర్షం. మరోవైపు 18న కురిసిన వర్షాలకే రికార్డు స్థయిలో ప్రాజెక్ట్ లన్నీ నిండుకుండను తలపించాయి. అన్నమయ్య, బుగ్గవంక, వెలిగల్లు, చిత్రావతి, మైలవరం, గండికోట ప్రాజెక్టులకు భారీగా నీరు వచ్చి చేరుతోంది. చెయ్యేరు నదిపై మొదటి ప్రాజెక్ట్ పింఛా ప్రాజెక్ట్, దాని తరువాత అన్నమయ్య ప్రాజెక్టు ఉంది. పింఛా డ్యాం విడుదల పామర్థ్యం కేవలం 48 వేల క్యూసెక్కులు మాత్రమే… నవంబర్ 18 సాయంత్రానికి పింఛాకు 50 వేల క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉంది. అన్నమయ్య కూడా ఇదే స్థాయి ఇన్ ఫ్లో కంటిన్యూ అవుతోంది. అనూహ్యం పింఛాకు 1.17 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. దీని విడుదత సామర్థ్యం కన్నా రెండున్నర రెట్టు ఎక్కువ గా ఉంది. అప్పటికే రింగ్ బండ్ ను ప్రొటెక్ట్ చేసినప్పటికీ ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఏక కాలంలో 1.50 క్యూసెక్కులు వచ్చి అన్నమయ్యను తాకగానే .. ఒక్కసారి పెద్ద శబ్ధంతో డ్యాం తెగి, వరద జనావసల్లోకి వచ్చిపడింది.
నష్టం మిగిల్చిన కష్టం!
అన్నమయ్య ప్రాజెక్టు 2001లో వినియోగంలోకి వచ్చింది. ఈ ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 2.23 టీఎంసీలు. చిత్తూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు చెయ్యేరుకు వరద ఉధృతి భారీగా పెరిగింది. పింఛా ప్రాజెక్టుకు 38 వేల క్యూసెక్కులు ఉన్న వరద రాత్రిరాత్రే లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి ప్రాజెక్ట్ ను తాకుతోంది. అప్పటికే ప్రాజెక్ట్ ఉన్న రింగ్ బండ్ నీటిలో కొట్టుకుపోయింది. ఒక పక్క పింఛా ప్రాజెక్ట్ నుంచి వరద ఉప్పెన వచ్చి అన్నమయ్యకు చెరుతుంటే .. మరోపక్క మాండ్య నది నుంచి కూడా వరద పోటెత్తింది. దీంతో డ్యామ్ స్విల్ వే డిశార్జి కెపాసిటీ 2.85 లక్షల క్యూసెక్కులు కాగా … 3.50 లక్షల క్యూసెక్కులకు చేరింది. ఏ క్షణమైన కట్ట తెగిపోమే ప్రమాదం ఉందని తెల్లవారుజామున అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అలా ప్రకటించిన కొద్దిసేపటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. భారీ శబ్దంతో డ్యామ్ కట్ట బద్దలైంది. ఇక తరువాయి మిగిలింది విధ్వంసమే అన్నట్లు సాగింది వరద ప్రవాహం. రాజాంపేట మండలం రామాపురం చెక్ ఫోస్ట్ వద్ద కడప- తిరుపతి జాతీయ రహదారిని ముంచెత్తింది. ఈక్రమంలోనే అటుగా వస్తున్న పల్లె వెలుగు బస్సు పూర్తిగా నీటి మునిగింది. అందులో ప్రయాణిస్తున్న 12 మంది మృతి చెందారు. హస్తవరం, నందులూరు మధ్య నిర్మించిన చెన్నై – ముంబై ప్రధాన రైల్వే లైన్ బ్రిడ్జి, కిలోమీటరు మేరకు రైలు మార్గం ధ్వంసమయ్యింది. గతంలో ఈ తరం చూడని వరద కడప జిల్లా వాసులు చూశారు.వేల ఏకరాల్లో పంటలు, వందల సంఖ్యలో ఇళ్లు, పదుల సంఖ్యలో ప్రాణాలను కోల్పొయ్యారు. ఇలా కడప వరదల్లో కకవికలమైంది. అయితే అన్నమయ్య ప్రాజెక్ట్ ఉన్న 5 గేట్లలో ఒక గేటు ఎప్పటినుంచి రిపేర్లో ఉంది. దాని మరమ్మత్తు చేపట్టడకుండా నిర్లక్ష్యంగా ఉండటం ఒకవైపు అయితే, ప్రాజెక్ట్ నాణ్యత లోపాలు ఉన్నాయని మరోవైపు వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఏదిఏమైనా జరగాల్సిన ఉపద్రవం జరిగిపోయింది. అపార పంట, ప్రాణ నష్టం మిగిల్చి .. ఎందర్నో నిరాశ్రయులను చేసింది.











