రాహులతో జోడిని తెంచుకోలేక పిచ్చి పగల్భాలు..!
ప్రశాంత్ కిషోర్..! ఎన్నికల వ్యూ(ఉ)హకర్త..!! ఆయన మాటలకు, చేతలకు ఈమధ్య బాగా గ్యాప్ ఉంటుంది. డబ్బిస్తానంటే ఎవర్నినైనా తలకెత్తుకుంటాడు. డబ్బుకోసం ఎంతకైనా దిగజారతాడు. ఒకసారి పొగడ్తలతో ముంచెత్తాడు.. మరోసారి విమర్శలతో సమాజంలో దిగజారతాడు! అందుకే ఈమధ్య అతని పట్ల రాజకీయ నాయకులు కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఏదో ఆశించి కాంగ్రెస్ పక్షన చేరిన ఈ కిరాయి రాజకీయ కిరాతకుడు.. తాను ఆశించిందేమి అక్కడేమి జరగలేదు. సోనియా, రాహుల్, ప్రియాంకలతో వరస భేటీల సారాంశం పీకే కు నచ్చలేదో .. లేకుంటే పార్టీలో ఆశించిన పదవికి నో చెప్పారో కానీ ..మొత్తానికి తెగదెంపులు చేసుకునే ఆ మొన్న రాహుల్ విమర్శలు గుప్పించారు. రాహుల్ నాయకత్వం సరిగా సరిగా లేదని, ఆయన జీవితంలో ప్రధాని కాలేడని.. సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. ఇలా రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించిన పీకే.. నిన్న పొగడ్తలతో ముంచెత్తాడు. అంతకుముందు విమర్శలు, శాపనార్థాలు పెట్టి.. నిన్న పొగడ్తలేంటి? అని అవి విన్న వారంతా అవాక్కవుతున్నారు! పీకే పిల్లి మొగ్గలు వెనుక రాజకీయ కారణం కూడా లేకపోలేదు.
జోడి నెంబర్ ఒన్ కోసం పాకులాట..!
దిదిని ప్రధాని పీఠంపై చూడాలని కిరాయి కిరాతకుడు అనబడే పీకే .. కలకత్తా కాళీ వద్ద కంకణం కట్టుకున్నాడు. అందుకే బీజేపేతర కూటమిని సిద్ధం చేస్తున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాుట దక్షిణ భారతంలో చురుకుగా పావులు కదుపుతున్నాడు. ఈ సారి ఎలగైన మోదీని గద్దె దించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గత ఏడాది కాలంగా రాహుల్ రాగాన్ని అందుకున్న పీకే… ఈ మధ్య ఎందుకో కలహించాడు. పీకే చర్యలను రాహుల్ పెద్దగా ఎంకరేజ్ చేయలేదు కాబోలు. ఈ క్రమంలోనే వీరిరువురు మధ్య బాగా గ్యాప్ పెరిగింది. అయితే బంధాన్ని రాహుల్ మర్చిపోయినా.. పీకే ఏమాత్రం వదలడలేకపోతున్నారు. మొన్న ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పుకొచ్చారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ లేకుండా కేంద్రంలో ఏ కూటమిని నడపడం సాధ్యం కాదంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లేకుండా బలమైన ప్రతిపక్షం వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువని, కేవలం పార్టీలను కూడగట్టుకోవడం ద్వారాబిజెపి గెలుపు నియంత్రించలేని జోస్యం చెప్పాడు. మోడీని ఓడించేందుకు గట్టి సందేశాత్మక నాయకత్వం కావాలని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. ఈ రెండు ప్రకటనలు చూసి.. మెన్న రాహుల్ తిట్టి, ఈ రోజు ఈ పొగడ్తలేంటి? అని సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. డబ్బుల కోసమే పీకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, కిరాయి కోసం ఎంతటి పనికైనా సిద్దపడే కిరాతకుడని విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదిఏమైనా రాహుల్‌తో గతంలో ఏర్పరచుకున్న సంబంధాన్ని మెరుగు పరుచుకోవడానికే మళ్ళీ రాహుల్ ను కవ్విస్తున్నారని మరోవైపు పొలిటికల్ సర్కిల్స్ గుసగుసలు వినిపిస్తున్నాయి.
Must Read ;- ఏపీలో విధ్వంసకర రాజకీయాలకు కారకుడు ప్రశాంత్ కిషోర్& సో క్లియర్











