ఏపీలో ఊపందుకున్న మూడు రాష్ట్రాల డిమాండ్..!
జగన్ రెడ్డి నెలకొల్పిన ప్రాంతాల మధ్య చిచ్చు .. ఉత్తర,కొస్తాంధ్ర, రాయలసీయలో ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నిర్ణయించిన
ఏపీ రాజధాని అమరావతిపై రాష్టంలో మచ్చుకైన అభ్యతరాలు కనిపించలేదు. అందరి ఆమోదం మేరకే ఏపీ నడిబొడ్డునున్న గుంటూరు – కృష్టా జిల్లాల మధ్యలో
ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి అడుగులు పడ్డాయి. కానీ
జగన్ రెడ్డి గద్దెక్కిన ఆరునెళ్లకే చీలికలు తీసుకొచ్చి ఏపీని మూడు ముక్కులు చేసి ప్రాంతాల మధ్య వైట్ పెట్రోల్ పోసి చిచ్చును రాజేశారు. అది నేడు రాష్ట్ర ప్రజలను బడబాగ్నిలా దహించి వేస్తోంది. అందులో
జగన్ రెడ్డి కాలి బూడిదవ్వడం దేవుడెరుగును కానీ.. రాయాలసీమలో వేర్పాటు వాదాన్ని పెద్దఎత్తున రాజేసిందన్నది క్లియర్!
రేపోమాపో
ఉత్తరాంధ్ర నుంచి కూడా పరిపాలన రాజధాని డిమాండ్స్ తో ఉద్యమాలు, సభలు, పాదయాత్రలు ఉధృతం చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.
ఈ డిమాండ్సే రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా విభజించి పాలించుకుంటామన్న ఆశ్చర్యపోనక్కర్లేదు!ఇంటర్వెల్ తరువాత సినిమా ఇదేనా?
మొన్న చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న
పెద్దిరెడ్డి ఓ మాట అన్నారు. దాని పర్యవసానం ఇప్పుడు చూపాలని ప్రయత్నిస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ 22న జగన్ రెడ్డి మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించారు. అంతకన్నా ముందుగానే పెద్దిరెడ్డి చిత్తూరు నుంచి ఒక కూత కూశాడు. ఇది జెస్ట్ ఇంటర్వేల్ మాత్రం సినిమా ముందుంటుందని అన్నారు. ఇదే ఇప్పుడు
రాయలసీమ ప్రజలను రెచ్చగొట్టే యత్నానికి పురికొల్పుతోంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు పెట్లాలని విద్యార్థులతో, మేథావులతో వీధుల్లో ర్యాలీ చేయించి మరి అరిపిస్తున్నారు. ఒక్క అవకాశం ఇచ్చిన పాపానికి రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి వలె చేసి .. స్వార్థప్రయోజనాలకై ప్రజా శ్రేయస్సును, భవిష్యత్తును సర్వనాశనం చేశారు. ఇదిలా ఉంటే ప్రాంతీయ వేర్పాటు వాదాన్ని రెచ్చగొట్టి మూడు రాజధానుల బిల్లును వచ్చే అసెంబ్లీ పెట్టించే నీచ ఎత్తులకు పాల్పడుతున్నారు. అందులో భాగమే
రాయలసీమ చైతన్య సభ, ఆత్మగౌరవ సభలు!తిరుపతిలో రోడ్డెక్కిన విద్యార్థులు ..!
రాయలసీయ చైతన్య సభ ను
రాయాలసీమ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 18న తిరుచానూరు లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా న్యాయ రాజధానిని కర్నూల్లోనే ఏర్పాటే చేయాలి, వికేంద్రీకరణ బిల్లు వచ్చే అసెంబ్లీ సమావేశాలు పెట్టాలి, సభను జయప్రదం చేయాలి.. అన్న పలు డిమాండ్స్ తో తిరుపతిలోని కృష్ణాపురం ఠాణా నుంచి మున్సిపల్ కార్పోరేషన్ వరకు విద్యార్థులతో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు.
రాయలసీమ హక్కులు, జరగాల్సిన అభివృద్ధి, ఇప్పటి వరకు జరిగిన అన్యాయం వంటివి తిరుచానూర్ లో నిర్వహించేబోయే సభలో చర్చిద్దాం.. తరలిరావాలంటూ రాయసీమ మేథావులు ఫోరం సభ్యులు కోరుతున్నారు. ఇది ఒకటైతే మరోపక్క పోటాపోటీగా
కర్నూలు జిల్లాలో రాయలసీయ ఆత్మగౌరవ సభ పేరుతో మరో బహిరంగ సభను గురవారం నిర్వహిస్తున్నారు. విద్యార్థి సంఘాలు ఈ సభను నిర్వహిస్తున్నాయి. కర్నూల్ ను న్యాయ రాజధానిగా ప్రకిటించి, కృష్ణా రివర్ బోర్డు, శ్రీభాగ్ ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూల్ జిల్లాల అభివృద్ధికి ఏం చేస్తున్నారు? అన్నది స్పష్టంగా చెప్పి సీఎం చట్టభద్రత కల్పించాలని డిమాండ్స్ వినిపిస్తున్నారు. ఆ మొన్న ఉత్తరాంధ్ర నుంచి మూడు రాజధానులకు మద్దతుగా పాదయాత్ర చేయాలని కొందరు సిద్ధమయ్యారు. ఇలా మూడు ప్రాంతాలు మూడు ముక్కలుగా విడిపోయి కొట్టుకుంటున్నారు.
‘‘ప్రజల్లో వేర్పాటు వాదం.. ఒక నినాదంగా మారింది! ఇవే డిమాండ్స్ మూడు ప్రాంతాలు నుంచి మూడు రాష్ట్రాలుగా విడిపోయినా ఆశ్చర్యం లేదని మేధావులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు’’https://www.youtube.com/watch?v=B7-wHh0PdUM