శ్రీకాకుంళ నుంచి కర్నూలు, కడప జిల్లాల వరకు …!
ఉత్తరాంధ్ర నుంచి మొదలైన రాజకీయ మార్పులు .. కడప, కర్నూలు జిల్లాలకు పాకింది. సొంతవారే అధికారపార్టీ రూపంలో వేధింస్తుంటే … వాటిని తాళ్ళలేక ఆత్మగౌరవం కోసం సేఫ్ జోన్ టీడీపీనే భావించి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుంటున్నారు. కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రెడ్డి కుటుంబ టీడీపీ కండువా కప్పుకున్న తరువాత .. శ్రీకాకుళం, కర్నూల్ జిల్లాలో టీడీపీ వలసలు పెరిగాయి. పార్టీ మారి, ఆత్మగౌరవాన్ని పెంచుకోవడమే బెటర్ అని అధికారపార్టీలోని బాధిత కుటుంబాలు టీడీపీలోకి పెద్ద సంఖ్యలో వచ్చి చేరుతున్నారు. ఇదిలా ఉంటే తెలుగు దేశం పార్టీ కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీఠవేస్తూ .. ప్రజారంజక పాలన అందించే దిశగా పార్టీగా అడుగులు వేస్తోంది అన్నది నాటిది కాదు. అది అన్నగారు ఎన్టీఆర్ నుంచే వస్తున్న వారసత్వమే. అందుకే టీడీపీ అంటే తెలుగింటి పార్టీ, మన పార్టీ అని భావించారు కాబట్టే రాష్ట్ర వ్యాప్తంగా అధికార వైసీపీ నుంచి వలస ప్రవాహం టీడీపీ వైపు పయనిస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పుంజుకున్న టీడీపీ..!
స్థానిక సంస్థ ఎన్నికలు రాష్ట్రంలోని రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కించాయి. టీడీపీ అనూహ్యంగా పుంజుకుంది. వైసీపీ అభ్యర్థులకు పోటీపడి మరి స్థానిక సంస్థ ఎన్నికల్లో టీడీపీ గెలిచి నిలుచుంది. అధికార పక్షానికి దీటుగా ఫలితాలను రాబట్టి .. ప్రజల మన్నలను పొందింది. అధికారపార్టీకి చెందిన మంత్రులు, బలమైన ప్రతినిధుల ఏలుబాటులో ఉన్న స్థానాల్లో టీడీపీ జెండాను రెపరెపలాడించారు నాయకులు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో టీడీపీ మంచి ఫలితాలను సాధించింది. టీడీపీ పుంజుకోవడం కార్యకర్తలకు, నాయకులకే కాదు.. అధికారపార్టీలోని బాధిత,పీడిత కార్యకర్తలకు, నాయకులకు వరంగా మారింది. అందుకే మొన్న శ్రీకాకుళం జిల్లా రేగడి మండలం శిర్లం పంచాయతీలో వైసీపీకి చెందని 500 కుటుంబాలు అధికారపార్టీకి రాజీనామ చేసి టీడీపీ కండువా కప్పుకున్నారు. నిన్న కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలంలో సౌదరదిన్నె గ్రామంలో అధికారపార్టీకి చెందిన 150 కుటుంబాలు టీడీపీ కండువా కప్పుకున్నాయి. బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి సమక్షంలో ఈ కుటుంబాటు టీడీపీలోకి వలస వచ్చాయి. ఉత్తరాంధ్ర నుంచి మొదలైనా మార్పు .. వైసీపీని వీడి టీడీపీలోకి వందలాదికుటుంబాలు వలస బాటపడుతున్నాయి. అధికారపార్టీ విధానాలు, ఎమ్మెల్యేల పనితీరు చూసి గ్రామీణ ప్రాంతాల్లోని కార్యకర్తలు విసిగారు. గోడు వినిపించాలంటే ఆలకించే దిక్కు లేక వేజారారు. ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు అధికారపార్టీ వీడటం కార్యకర్తలకు అనివార్యమైంది. విధానాలు, క్రమశిక్షణ, కలుపుకుపోయే తత్వం, ఆమోదయోగ్యమైన సిద్ధాంతాలను అనుసరిస్తుంది కాబట్టే.. తెలుగు దేశం ఎప్పుటి నుంచో ఒక స్థిరమైన కేడర్ ను, అత్యధికంగా కార్యకర్తలను కలిగి ఉంది అన్నది వాస్తవం.
Must Read ;- అధికారపార్టీలో తగ్గిన జోష్..! డైలామలో ఫ్యాన్ కేడర్!!










