బాధ్యతలకు వెనకాడితే .. రాజీనామా చేయండి..!
రాష్ట్రంలో జరుగుతున్న విపత్తులకు సీఎం హోదాలో అన్నీంటికి జగన్ బాధ్యత వహించాలి. బాధ్యతలకు వెనకాడితే సీఎంగా ఉండే అర్హత జగన్ లేనట్లే. కడప జిల్లా అన్నమయ్య ప్రాజెక్ట్ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం జవాబుదారీతనంగా వ్యవహిరించకపోవడం శోచనీయం. భారీ వర్షాలు పడి అన్నమయ్యకు రెండు సార్లు వరదలు వచ్చాయి. అయిన ప్రభుత్వం స్పందించలేదు. మళ్లీ వరద వస్తోందని వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. సకాలంలో చర్యలు తీసుకొని ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదు. గేటు రిపేర్ ఉంది అని తెలిసి కూడా ఉపక్రమించకపోవడం కడు శోచనీయం. ముందస్తు చర్యలు తీసుకుని ఉండి ఉంటే ప్రాజెక్ట్ ను కాపాడేవారని ప్రతిపక్షనేత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం జగన్ ప్రభుత్వ వైఫల్యం వల్లే ప్రాణ నష్టం జరిగింది. 62 మంది చనిపోవడానికి, రూ.6 వేల కోట్ల పంట, ఆస్తి నష్టానికి కారణం ఏపి ప్రభుత్వమే. దమ్ముంటే దీనికి బాధ్యత వహించి జ్యుడీషియల్ ఎంక్వయిరీకి అంగీకరించాలని సవాలు విసిరారు చంద్రబాబు.
సొంత జిల్లాలో దిగజారిన జగన్ ..!
సొంత జిల్లాలో జగన్ రెడ్డి పోలీసుల బందోబస్త్ నడుమ పర్యటించాల్సిన పరిస్థితి ఎందుకు పట్టిందో పహరా కాసిన పోలీసులే చెప్పాలి. సొంత జిల్లాలో జరిగిన జల విధ్వంసం, ఆస్తి, ప్రాణ నష్టంపై జగన్ రెడ్డి స్పందించిన తీరు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తీవ్ర విమర్శలకు తావిస్తోంది. గోడు విన్నవించుకోవడానికి ప్రజలు బయటకు వస్తారని తెలిసి వారిని పోలీసులతో గృహ నిర్భందం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. రాయల చెరువు తెగితే 35 గ్రామాలు జలమయం అయ్యేవి. మామూలు వ్యక్తులతో రాయల చెరువు మరమ్మతులు చేయిస్తే సరిపోద్దా? ఇప్పటీకైనా నిపుణులతో చెరువు గట్టు మరమ్మతులు చేయించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పెన్నా నదిలో కరకట్టలకు ప్రమాదం జరిగేంతగా ఇసుక తవ్వకాలు జరిగిపారు. ఇసుక కారణంగా కట్ట తీవ్రంగా దెబ్బతిన్నది. నెల్లూరు జిల్లాలో రూ. 2 వేల కోట్ల నష్టం జరిగింది. వరదల్లో జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి పూర్తి పరిహారం చెల్లించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Must Read ;- అంతర్జాతీయంగా భారత్ పరువు తీస్తున్న ఏపీ ప్రభుత్వం!!











