ఓ పక్క ఎన్టీఆర్ హోస్ట్ గా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’, ఇంకో పక్క కింగ్ నాగార్జున హోస్ట్ గా ‘బిగ్ బాస్ 5’ తెలుగు సీజన్.. టీఆర్పీ రేటింగులకే ఇది పరీక్షా సమయం. ఆగస్టు 22 నుంచి ఎవరు మీలో కోటీశ్వరులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ 5 షెడ్యూల్ కూడా వచ్చేసింది. సెప్టెంబరు 5 సాయంత్రం ఈ షో ప్రారంభం అవుతుంది. ఈ రెండూ రెండు విభిన్నమైన కాన్సెప్ట్ లతో రూపొందినవి. అయినా రెండింటి మధ్యా పోటీ తప్పకుండా ఉంటుంది. కంపారిజన్ కూడా ఉంటుంది.
ప్రధానంగా స్టార్ మా, జెమినీ టీవీల మధ్య కూడా ఇది మంచి పోటీ అని చెప్పవచ్చు. సోమవారం నుంచి శుక్రవారం వరకూ రాత్రి 10 గంటలకు, శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు బిగ్ బాస్ 5 షో ప్రారంభమవుతుంది. అయితే ఈ రెండు షోలకూ క్లాష్ అయ్యే ప్రమాదం లేదు. ఎవరు మీలో కోటీశ్వరులు రాత్రి 8.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ టైమింగ్స్ విషయంలో క్లాష్ కాకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకున్నారు.
గతంలో రాత్రి 9 నుంచి 10.30 గంటల వరకూ కొనసాగేది. ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్ల పేర్లు ముందే బయటికి వచ్చాయి. అధికారికంగా మాత్రం ఇంకా ఎవరెవరు హౌస్ లోకి వెళతారన్నది మాత్రం తెలియదు. ఇప్పటికే అందరూ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. వీరికి సంబంధించిన వీడియో షూట్ కూడా జరిగిపోయింది. యాంకర్ రవి, మానస్ నాగులపల్లి, షణ్ముఖ్ జస్వంత్, ఆర్జే కాజల్ (యాంకర్), నవ్య స్వామి (సీరియల్ హీరోయిన్), శ్రీహాన్ (సీరియల్ నటుడు), జస్వంత్ పాదాల (మోడల్), లోబో (యాంకర్) ఉన్నారు.
ఇంకా ఈషా చావ్లా, ఉమాదేవి (కార్తీకదీపం భాగ్య), ప్రియాంకా రామన్ (క్రాక్ ఫేమ్), నిఖిల్ (యాంకర్), సిరి హనుమంత్ (సీరియల్ నటి), వీజే సన్నీ (సీరియల్ నటుడు), జబర్దస్త్ ప్రియాంక అలియాస్ సాయి (ట్రాన్స్ జెండర్), సినీ నటి ప్రియ, టీవీ 9 ప్రత్యూష, సరయు, జ్యోతి రాజ్ (ఆట సందీప్ భార్య), ఆట సందీప్, సురేఖా వాణి, యాంకర్ రోజా, ఆనీ మాస్టర్.. ఈ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీరిలో ఎవరైనా మారే అవకాశం ఉండొచ్చు.
Must Read ;- బిగ్ బాస్ తెలుగు హోస్ట్ గా ఎవరు భేష్?