Locked Gram Sachivalayam In The Constituency Of Deputy CM Narayana Swamy :
పై ఫొటోలో కనిపిస్తున్నది ఎక్కడో పట్టణాల్లో ఉన్న భవనం కాదు. చిత్తూరు జిల్లాలోని ఓ కుగ్రామంలోని భవనమే. ఈ భవనాన్ని కేవలం గ్రామ సచివాలయం కోసమే కొత్తగా నిర్మించారు. జగన్ సర్కారు కొత్తగా వేసిన వైసీపీ రంగులు దీనిపై పడ్డాయో, లేదో తెలియదు గానీ.. ఇప్పుడైతే ఈ భవనానికి సాధారణ రంగులే ఉన్నాయి. మరేమిటి.. ప్రత్యేకం అంటారా? సకల హంగులతో నిర్మితమైన ఈ భవనాకి ఇప్పుడు తాళం పడిపోయింది. అరెరే.. ఇంత బాగా కట్టిన ఈ భవనానికి ఎందుకు తాళం పడిపోయింది అంటే.. దానికి కూడా జగన్ సర్కారు నిర్లక్ష్యమేనని కారణమని చెప్పాలి. చూడబోతే.. ఒక్క సచివాలయమేమిటి.. ఈ భవనంలో ఇంకా చాలా కార్యాలయాలే పెట్టుకోవచ్చు. అంత విశాలంగా ఉంది. అయితే సర్కారీ స్కూల్ ప్రాంగణంలో నిర్మించిన ఈ భవనంలో సచివాలయం పెట్టడానికి వీల్లేదని సుప్రీంకోర్టు చెప్పింది కదా. ఆ కారణంగానే దీనికి తాళం పడిపోయింది.
ఆ డిప్యూటీ ఇలాకాలోనే..
సర్కారీ భవనమైనా.. దీనిని ప్రభుత్వ నిధులతో నిర్మించారా? లేదంటే.. ప్రైవేటు వ్యక్తి పాఠశాల ఆవరణలో స్థలం ఫ్రీగా దొరుకుతుంది కదా అని ఇక్కడ ఈ భవనాన్ని నిర్మించి ప్రభుత్వానికి అద్దెకు ఇచ్చారో తెలియదు గానీ.. ఈ భవనం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది. ఎందుకంటే.. ఈ భవనం ఉన్నది జగన్ కేబినెట్ లో డిప్యూటీ సీఎం హోదాలో ఎక్సైజ్ శాఖను పర్యవేక్షిస్తున్న మంత్రి నారాయణ స్వామి నియోజకవర్గంలోనే. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు (ఎస్సీ) నియోజకవర్గం నుంచి నారాయణ స్వామి ఎన్నికైన సంగతి తెలిసిందే. గంగాధర నెల్లూరు మండల పరిధిలోని పాపిరెడ్డిపల్లెలోనే ఈ భవనం ఉంది. పాఠశాల ఆవరణలో గ్రామ సచివాలయం ఉండరాదన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ భవనాకి తాళం పడిపోగా.. మరో చోట గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది.
Must Read ;- ఏపీ పోలీసులూ.. ఈ మాట వినపడిందా?