బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ కు తెర లేచింది. ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్లు ఎవరెవరో తెలుస్తోంది. హౌస్ లో అడుగుపెట్టబోయే వ్యక్తుల మీద గత కొంత కాలంగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఇప్పుడు కొంత క్లారిటీ వచ్చినట్టే. బిగ్ బాస్ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అత్యధిక టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకునే షో ఇది. సెప్టెంబరు 5 నుంచి స్టార్ మాలో ఈ షో ప్రారంభం కాబోతోంది.
ఈసారి హౌస్ లోకి అడుగుపెట్టబోయే వ్యక్తుల్లో గ్లామర్ డోస్ కు తక్కువ లేదు. యాంకర్ రవి, హీరో మానస్ నాగులపల్లి, షణ్ముఖ్, నటి శ్వేతా వర్మ, హీరోయిన్ ఇషా చావ్లా, కార్తీక దీపం ఉమాదేవి, ఆట సందీప్ – సందీప్ భార్య జ్యోతిరాజ్, సరయు, మోడల్ జస్వంత్ పాదాల, వీజే సన్నీ, జబర్దస్త్ ప్రియాంక అలియాస్ సాయి (ట్రాన్స్ జెండర్) నటి ప్రియ, కొరియోగ్రాఫర్ ఆనీ మాస్టర్, యాంకర్ రోజా, ఆర్జే కాజల్, నవ్య స్వామి, నిఖిల్, శ్రీహాన్ తదితర పేర్లు వినిపిస్తున్నాయి.
వీరిలో చాలా మంది దాదాపు ఖరారైనట్టుగా సమాచారం. త్వరలోనే వీరంతా హౌస్ లోకి వెళ్లబోతున్నారు. ఈసారి కూడా కింగ్ నాగార్జున దీనికి హోస్ట్ చేయబోతున్నారు. అధికారికంగా ఈ పేర్లను త్వరలో వెల్లడించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అటు వెండితెర, ఇటు బుల్లి తెర, సోషల్ మీడియా మేళవింపుతో ఈ జాబితాను తయారుచేసినట్టు తెలుస్తోంది.