కామన్ మేన్ నుంచి సెలబ్రిటీ వరకు అందర్నీ ఆకట్టుకుంటున్న రియాల్టీ షో బిగ్ బాస్. ఇప్పటి వరకు బిగ్ బాస్ 4 సీజన్ లను సక్సస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. బిగ్ బాస్ సీజన్ 4 టీఆర్పీ రేటింగ్ లో రికార్డ్ క్రియేట్ చేయడంతో బిగ్ బాస్ 5 సరికొత్తగా ఎలా ఉండబోతుంది..? ఈసారి కంటెస్టంట్స్ గా ఎవరు బిగ్ బాస్ హౌస్ లోకి రానున్నారు అనేది ఆసక్తిగా మారింది. అయితే.. ఈపాటికే బిగ్ బాస్ 5 స్టార్ట్ కావాలి కానీ.. కరోనా కారణంగా వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం.. కొత్త సీసన్ కోసం స్టార్ యాజమాన్యం సిద్ధం అవుతుంది. త్వరలో బిగ్ బాస్ సీసన్ 5 స్టార్ట్ చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
జూన్, జులై లో సీసన్ 5 ప్రారంభించాలి అనుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా మారిన నేపథ్యం లో ఈసారి కూడా ఆలస్యం కానుంది సీసన్ 5 కోసం కంటెస్టెంట్ ఎంపిక నిర్వహణ వంటి విషయాల పై ఇప్పటికే ప్రణాళికలు మొదలైపోయాయి. ఆల్రెడీ షోలో పాల్గేనే కంటెస్టంట్ల ఎంపిక స్టార్ట్ అయ్యింది. అయితే షో మాత్రం సెప్టెంబర్ లో స్టార్ట్ కానుందని సమాచారం. కంటెస్టెంట్స్ ఎంపిక అనంతరం వారిని క్వారంటైన్ కి పంపాలి కాబట్టి ఈ సీసన్ కూడా కొంచెం ఆలస్యం కానుంది. గత సీసన్ లో మాదిరిగా కాకుండా కొంచెం పరిచయం ఉన్న సెలెబ్రిటీలను హౌస్ లోకి పంపాలని స్టార్ మా ఆలోచన ఉందని సమాచారం.
ఈసారి బిగ్ బాస్ 5 కంటెస్టంట్లు ఎవరంటే.. యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్, టిక్ టాక్ స్టార్ దుర్గ రావు, యాంకర్ రవి తో పాటు మరికొందరు బుల్లితెర సెలెబ్రిటీల పేరులు వినిపిస్తున్నాయి, ఇక పాయల్ రాజపుట్, భూమిక వంటి హీరోయిన్స్ పేరులు కూడా ప్రచారం కాగా ఆ వార్తలను వారు ఖండించారు. ఏది ఏమైనా గత సీసన్ కి మించి సరికొత్త సీసన్ 5 సిద్ధం కానుంది అని సమాచారం. ఇక హోస్ట్ గా టాలీవుడ్ కింగ్ నాగార్జున వరసగా మూడవసారి రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. బిగ్ బాస్ 5 ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా.. అంతకు మించి అనేలా.. సరికొత్త వినోదాన్ని అందించేలా.. ఈ సీజన్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మరి.. టీఆర్సీ రేటింగ్ లో బిగ్ బాస్ సీజన్ 5 ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి.