నెలకేసి కొట్టిన బంతి కూడా ఎంతో వేగంగా పైకి లేస్తోంది. అంతే వేగంతో ఇప్పుడు జగనన్న వదిలిన బాణం షర్మిల ఆయన వైపు రివర్స్ లో దూసుకు వస్తోంది.
ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు అనివార్యమయ్యాయి. నాలుగునరేళ్ళు రాష్ట్రాన్ని అన్నీవిధాలుగా సర్వనాశనం చేసిన జగన్ పార్టీ .. ఇప్పుడు పతనం రుచి ఎలా ఉంటుందో చవిచూస్తోంది. జగన్ రెడ్డి అకృత్యాలు చూసి సొంతవారే దూరం అయ్యారు. అమ్మ.., చెల్లిలను ఏనాడు జగన్ ను దూరం పెట్టి.., పక్కరాష్ట్రాలకు తరిమికొట్టాడు. బంధువులు, అనుయాయులు అనుకున్న ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్కనేతలు సైతం జగన్ ను వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే మంచి అవకాశమని కాంగ్రెస్ పావులు కదుపేందుకు వ్యూహాలు రచిస్తోంది.
వైఎస్ షర్మిల తండ్రి వైఎస్ఆర్ తగ్గ తనయ. ఆ మాటలో ఎటువంటి మార్పు లేదు. తూటాలాంటి మాటలతో ప్రత్యర్ధులను చిత్తు చేసే సన్మోహన వాక్ఛాతుర్యం కలిగిన స్ట్రాంగ్ మహిళా షర్మిల. అందుకే కాంగ్రెస్ అధిష్టానం.. ఏపీలో జీవం పోసుకునేందుకు షర్మిలను ఎంచుకుంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల పేరును ప్రతిపాదించేందుకు ఢిల్లీలో శరవేగంగా పావులు కదులుతున్నాయి. ఇప్పటికే కర్నాటక, తెలంగాణ గడ్డపై జెండా పాతిన కాంగ్రెస్ ఏపీపై ప్రత్యేక దృష్టిసారించింది. రాష్ట్ర విభజన తరువాత ఏపీ కాంగ్రెస్ కేడర్ ను, నేతలను అస్తగతం చేసుకున్న జగన్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్దమైంది. అందుకే జగన్ సోదరిని ఎంచుకుని అస్త్ర ప్రయోగానికి ఏర్పాట్లు చేస్తోంది. ఢిల్లీ వేదికగా సాగుతున్న మంతనాలు.. దాదాపు ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా షర్మిల పేరును ఖరారు చేసినట్లు సమాచారం.
ఈ నేపధ్యంలో వచ్చే కొత్త సంవత్సరం నుంచే ఏపీ కాంగ్రెస్ బాధ్యత పగ్గాలను షర్మిల చేపట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ లు షర్మిల విషయంలో ఇప్పటికే ఒక స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. అలానే పార్టీ ఏపీ వ్యవహారాల ఇంచార్జీగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన మాణిక్యం ఠాగూర్ కూడా షర్మిల ఎంపిక పట్ల సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈనేపధ్యంలో ఏపీ వ్యాప్తంగా కాంగ్రెస్ లో కొత్త జోష్ నింపేందుకు షర్మిల పదవీ బాధ్యతలు స్వీకరించాలని పలువురు కోరుకుంటున్నారు. పాత తరం కాంగ్రెస్ నేతలతో పాటు వైసీపీ వ్యతిరేక వర్గం కూటమి కూడా షర్మిల నాయకత్వాన్ని బలపర్చేందుకు సిద్ధమవుతున్నారు.
ఇలా మొత్తంగా ఏపీలో జీవం కోల్పోయిన కాంగ్రెస్ కు నూతన ఉత్తేజాన్ని తెచ్చేందుకు షర్మిల నే అన్నీవిధాలుగా సరైన లీడర్ అని అధిష్టానం నమ్ముతోంది. మరోవైపు జగన్ రెడ్డికి చెక్ పెట్టేందుకు సరైన సమయం కూడా ఇదేనని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక సొంత పార్టీ నుంచి అటు కాంగ్రెస్ నుంచి ముప్పెట దాడి తప్పదు అన్న సంకేతాలు పొలిటికల్ సర్కిల్లో బలంగా వినిపిస్తున్నాయి.