సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఉపాధి కూలీగా మారారు. నగరి ఎమ్మెల్యే రోజా ఇలాకాలో ఉపాధి పనులు చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. చిత్తూరు జిల్లా నగరి మండలంలోని అయినంబాకంలో ఉపాధి పనులు చేశారు. కూలీల సమస్యలో, ఉపాధి పనులు వివరాలో తెలుసుకోవడానికి ఆయన అక్కడికి వెళ్లలేదు. కూలీగా మారి రెండురోజులు ఉపాధి పనులు చేశారు. చెరువు పూడికతీత పనుల్లో స్వచ్ఛందంగా పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. తోటి కూలీల మాదిరిగానే ఎర్రటి ఎండలోనే నారాయణ ఉఫాది పనులు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పథకం ప్రారంభంలో ఎండకాలంలో కూలీలకు మజ్జిగ ఇచ్చేవారనీ, కూలీలు సేద తీరేందుకు టెంట్లు కూడా ఉండేవని, ఇప్పుడు అలాంటి కనీస వసతులు లేవని వాపోయారు. ఓ పార్టీ నేత అయి ఉండి కూడా పలుగు పార పట్టి ఉపాధి పనులు చేయడంతో నారాయణగారు… మీరు చాలా గ్రేట్ అంటూ ప్రతిఒక్కరూ ఆయన్నుప్రశంసిస్తున్నారు.
నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!
DSCపై వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై మంత్రి నారా లోకేశ్ మరోసారి తీవ్రస్థాయిలో...











