(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
విజయనగరం నగర పాలక సంస్ధ డిప్యూటీ మేయర్ ముచ్చు నాగలక్ష్మి కరోనాతో మృతి చెందారు. కొంత కాలంగా నగరంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం రాత్రి మృతి చెందారు. డిప్యూటీ మేయర్‌గా పదవీ ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు పూర్తి కాక మునుపే మృతి చెందటంతో స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆమె కుటుంబీకులు, బంధువులు, ఆత్మీయులు కన్నీరు మున్నీరవుతున్నారు.











