ఆయన ఉపముఖ్యమంత్రి. అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంతటి వాడు. కానీ నోరు తెరిస్తే బూతులు గంగాప్రవాహంలా వెల్లువెత్తుతాయి. ఆయన తన బూతు పాండిత్యంతో తాజాగా చంద్రబాబునాయుడును ఒక రేంజిలో తిట్టిపోశారు. సభ్యత మరచి చంద్రబాబునాయుడు బండబూతులు తిట్టారు. ఆయన తిట్ల రేంజికి విన్నవారు కూడా.. ఆ పార్టీ వారు కూడా షాక్ అయ్యారు. ఆయన ధోరణిపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధర్మాన కృష్ణదాస్ సంస్కారహీనంగా బూతులు తిట్టారంటూ వెల్లువెత్తుతున్న విమర్శలు వస్తున్నాయి.
కొడాలినానిని మించిపోయారు..
చంద్రబాబునాయుడును అసభ్యకరమైన బూతులు తిట్టడంలో కొడాలి నాని తనదైన ముద్ర సాధించారు. బహుశా కేవలం మరెవ్వరికీ సాధ్యం కాని రీతిలో అసభ్యమైన భాషలో చంద్రబాబునాయుడును తిట్టడం వల్లనే కావొచ్చు.. ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బాగా సన్నిహితులయ్యారనే వాదన కూడా ఉంది. తిరుమల డిక్లరేషన్ విషయంలో ఆయన ఏకంగా యావత్ హిందూ మతాన్నే నానా రకాలుగా తూలనాడినా.. జగన్ ఆయనను కనీసం మందలించడం కూడా జరగలేదంటే.. తన బూతు పాండిత్యంతో ఆయన జగన్ వద్ద సంపాదించుకున్న మంచిపేరే కారణం.
అయితే కొడాలి నానిని కూడా మరపించేలా ధర్మాన కృష్ణ దాస్ , చంద్రబాబునాయుడును బూతులు తిట్టారని అంటున్నారు. నిజానికి ధర్మాన ప్రసాదరావు అంటే.. చాలా పద్ధతిగా మాట్లాడే నాయకుడిగా పేరుంది. ఆయన విమర్శలు చేసినా కూడా చాలా శాస్త్రోక్తంగా ఉంటాయి. అలాంటి ధర్మాన ప్రసాదరావుకు సోదరుడు అయిన ధర్మాన కృష్ణదాస్ మాత్రం బూతులతో చెలరేగిపోతున్నారు. ఎంత చెలరేగినా.. జగన్ మామూలు పద్ధతిలోనే ఈ బూతు పురాణం గురించి పట్టించుకోవడం జరగదని పలువురు అనుకుంటున్నారు.
మంత్రి నోటి వెంట బండబూతులు – చంద్రబాబును ఉద్దేశించి ధర్మాన కృష్ణదాస్ బండ బూతులు – సభ్యత మరచి చంద్రబాబును బండబూతులు తిట్టిన ధర్మాన కృష్ణదాస్ – షాక్ అయ్యేలా చేస్తున్న ధర్మాన కృష్ణదాస్ ధోరణి –