తెలుగులో శౌర్యం, శంఖం, దరువు వంటి సినిమాలకు దర్శకత్వం వహించి ఆ తర్వాత తమిళ్‌లో అజిత్‌తో వరసగా సూపర్‌హిట్ చిత్రాలను రూపొంచించిన శివ ఇప్పుడు సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఈనెల 15 నుంచి హైదరాబాద్‌లో జరగనుంది. రజనీకాంత్ కొత్త సినిమాకి `అన్నత్తే` అనే టైటిల్‌ను నిర్ణయించారు. అన్నాత్తే అంటే అన్నయ్య అనే అర్థం వస్తుంది. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం అకో్టబర్ 8న హైదరాబాద్ వస్తారు రజనీకాంత్. వారం రోజులపాటు క్వారంటైన్‌లో ఉన్న తర్వాత 15 నుంచి షూటింగ్‌లో పాల్గొంటారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి కావాల్సింది.
లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్‌ను నిలిపి వేసి ఇప్పుడు దేశవ్యాప్తంగా షూటింగులు ప్రారంభమైన నేపథ్యంలో మళ్లీ షూటింగ్ మొదలు పెట్టింది చిత్ర యూనిట్. దీపావళికి రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా ఇలా ఆలస్యం కావడంతో సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారు. దానికి తగ్గట్టుగానే షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. హైదరాబాద్‌లో జరిగే షెడ్యూల్‌కి సంబంధించి త్వరలోనే చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా వెలుగొందిన మీనా, ఖుష్‌బూ ఈ సినిమాలో రజనీకాంత్ సరసన నటిస్తున్నారు. అంతేకాదు ఇప్పటి స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తోందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా పూర్తయిన వెంటనే లోకేష్ కనకరాజ్‌తో రజనీకాంత్ నెక్స్‌ట్ మూవీ ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే లోకేష్ చెప్పిన లైన్ రజనీకి నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని, ఇప్పడు తన స్రిప్ట్‌కి మెరుగులు దిద్దే పనిలో లోకేష్ ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ సంవత్సరం సంక్రాంతికి రజనీకాంత్, మురుగదాస్ కాంబినేషన్‌లో రూపొందిన `దర్బార్` విడుదలై తమిళ్‌లో 200 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు శివ దర్శకత్వంలో రూపొందున్న `అన్నాత్తే` కూడా ఆ రేంజ్‌లోనే రజనీ అభిమానుల్ని ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమా తర్వాత లొకేష్‌తో చేయబోయే సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా త్వరలోనే ప్రకటిస్తారని తెలుస్తోంది.