సౌత్ ఇండస్ట్రీలో సాయిపల్లవి యాక్టింగ్ టాలెంట్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూనే ప్రేక్షకులకు దగ్గరవడం ఆమెకు మాత్రమే చెల్లింది. ప్రస్తుతం సౌత్ లో ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. అంతేకాదు ఆమె రీల్ లైఫ్ లోనే కాకుండా.. రియల్ లైఫ్ లో కూడా హ్యాపీ గో లక్కీ పెర్సన్. ముఖ్యంగా ఫ్యామిలీ రిలేషన్స్ కు ఆమె బాగా ప్రాధాన్యతనిస్తుంది. ప్రత్యేకించి ఆమె చెల్లెలు పూజా కణ్ణన్ అంటే సాయిపల్లవికి ఎనలేని ప్రేమాభిమానాలు.
ప్రస్తుతం చెల్లెలి ఎంట్రీ కోసం రౌడీ బేబీ చాలా కష్టపడుతోంది. స్టంట్ కొరియో గ్రాఫర్ సెల్వా దర్శకుడిగా ఎంట్రీ ఇస్తూ తెరకెక్కిస్తోన్న సినిమాలో కథానాయిగా పూజా కణ్ణన్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అందులో సముద్రఖని, సెల్వా కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీనికి ఎ.యల్. విజయ్ స్ర్కీన్ ప్లే అందిస్తున్నాడు. అతి త్వరలోనే సినిమా ప్రారంభం కాబోతోంది.
పూజా కణ్ణన్ .. అక్క సాయిపల్లవి లా మంచి డ్యాన్సర్ . యూట్యూబ్ లో విడుదలైన కారా అనే షార్ట్ ఫిల్మ్ తో ఆమె మంచి పేరు తెచ్చుకుంది. ఎ.యల్. విజయ్ కు అసిస్టెంట్ గా పనిచేసిన పూజా .. ఇప్పుడు అతడి కథతోనే తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో కథానాయికగా ఎంట్రీ ఇవ్వనుండడం విశేషం. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పూజా కణ్ణన్ .. ఈ సినిమాతో తన అక్కనే మరిపిస్తుందేమో చూడాలి.
Must Read ;- చైతూ, సాయి పల్లవిల ‘లవ్ స్టోరీ’పాట ఇలా..