September 11, 2026 6:43 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Bollywood

మకుటాయమానం దిలీప్ ‘మొఘల్-ఏ- ఆజమ్’

మదర్ ఆఫ్ ఆల్ రొమాంటిక్ ఫిల్మ్స్ ఏది? అని అడిగితే ఎవరైనా సమాధానం చెప్పగలరా? ఈ తరంవారికి ఆ సినిమా గురించి తెలియదేమోగాని ఎంతోమందికి తెలిసిన పేరు ‘మొఘల్-ఏ- ఆజమ్’.భారతీయ సినిమాలో ప్రేమ కథలే అజరామరంగా నిలిచాయి.

July 7, 2021 at 9:14 AM
in Bollywood, Cinema, Editors Pick, Tollywood
Dilip Kumar Mughal E Azam
Share on FacebookShare on TwitterShare on WhatsApp

Dilip Kumar’s Mughal E-Azam Movie : 

భారీ విజయాలన్నీ ప్రేమ కథలకే దక్కాయి. సలీమ్, అనార్కలి ప్రేమను అజరామరంగా మలిచిన ‘మొఘల్-ఏ- ఆజమ్’ సినిమాను ఎవరూ మరచిపోలేరు. ఈ సినిమా నిర్మించి 60 ఏళ్లు పూర్తయింది. యూకేలో నిర్వహించిన ఓ సర్వేలో ఈ సినిమా ఆల్ టైమ్ గ్రేటెస్ట్ గానూ నిలిచింది. దిలీప్ కుమార్, మధుబాల ఇందులో హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ డిసెంబరు 11వ తేదీ ఆ మహానటుడి పుట్టిన రోజు. 1960లో కె. ఆసిఫ్ ఈ సినిమాని రూపొందించారు. ఇప్పటికీ ఈ సినిమాకి అంతటి ఆదరణ ఉంది.

మొఘల్ సామ్రాజ్యానికి చెందిన యువరాజు సలీం, నర్తకి అనార్కలి మధ్య అంకురించిన ప్రేమ పర్యవసానాలు ఏమిటన్నదే ఈ చిత్ర కథాంశం. నలుపు తెలుపులో రూపొందిన ఈ సినిమాకి రంగుల హంగులు కూడా తోడయ్యాయి. అప్పట్లో భారీ కలెక్షన్లు సాధించిన ఏకైక హిందీ చిత్రం ఇదే. ఆ తర్వాత ‘షోలే’, ‘దిల్ వాలే దుల్హనియా లేజాయెంగే’, ‘కుచ్ కుచ్ హోతాహై’ లాంటి మరికొన్ని చిత్రాలు కూడా చేరాయి.

ఎక్కడిదీ మొఘలుల ప్రణయగాథ?

ఈ కథకు ఓ నాటకం ప్రేరణ. 1922లో ఇంతియాజ్ అలీ తాజ్ ‘అనార్కలి’ పేరుతో ఈ నాటకాన్ని రాశారు. ఈ నాటకమే కాలక్రమేణా సినిమాలగానూ తెరకెక్కింది. మూకీలు, టాకీలు వచ్చాక కూడా అనేక రూపాల్లో సినిమాగా మారింది. దీన్ని సినిమాగా రూపొందించాలన్న ఆలోచన మరాఠీ నిర్మాత, సినీ లేబరేటరీ యజమాని సేర్ సిరాజ్ అలీ హకీమ్ కు వచ్చింది. కె.అసిఫ్ దర్శకుడిగా ఎంచుకుని 1944లో ఆ ప్రయత్నం చేశారు. అక్బర్ గా హిందీ నటుడు చంద్రమోహన్ ను ఎన్నుకున్నారు. సలీంగా సప్రూ, అనార్కలిగా నర్గీస్ ప్రధాన పాత్రధారులుగా 1946లో ‘మొఘల్-ఏ-అజమ్’ ప్రారంభమైంది. ఈలోగా దేశవిభజన జరిగింది.

దాంతో సేర్ సిరాజ్ దర్శకుడు ఆసిఫ్ ను మరో వ్యాపారవేత్త షాపూర్ణి పెస్తోంజీకి పరిచయం చేసి లాహోర్ కు వెళ్లిపోయారు. ఈ సినిమాని ఏ ముహూర్తాన ప్రారంభించారోగానీ అనేక ఆటాంకాలు ఏర్పడ్డాయి. ఆక్బర్ పాత్రధారి చంద్రమోహన్ 1952లో అకస్మాత్తుగా చనిపోయారు. సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఆసిఫ్ తనే నిర్మాతగా మారి 1951లో దిలీప్ కుమార్, నర్గిస్ లతో ‘హల్ చల్’ నిర్మించారు. దీనికి ఎస్ కె ఓఝ‌ూ దర్శకత్వం వహించారు. చంద్రమోహన్ మరణించాక ‘మొఘల్ ఏ ఆజమ్’ ప్రాజెక్టు తాత్కాలికంగా వాయిదా పడింది. ఆ స్థానంలోకి పృథ్వీరాజ్ కపూర్ ను తీసుకుని మళ్లీ ప్రారంభించారు. సలీం పాత్రకు దిలీప్ కుమార్ ను, అనార్కలి పాత్రకు మధుబాలను తీసుకున్నారు.

మధుబాల ఎంపిక ఎలా జరిగింది?

హీరోయిన్ కోసం ఆసిఫ్ పత్రికల్లో ప్రకటన ఇచ్చారు. గాన్ విత్ ది విండ్ తరహా ప్రయత్నాలివి. ఈ ప్రయత్నాలు ఇలా జరుగుతుండగా మరో ‘అనార్కలి’ సినిమా విడుదలైంది. ఇందులో ప్రదీప్ కుమార్, బీనారాయ్ జంటగా నటించారు. ఓ మంచి కథ ఉందంటే దాన్ని తస్కరించి వెంటనే సినిమాలు తీసే దొంగ సంస్కృతి అప్పట్లో కూడా ఉంది. ఆసిఫ్ వద్ద స్క్రిప్టుకు సహకారం అందిస్తున్న కమల్ ఆమ్రోహి లో కొత్త ఆలోచన వచ్చింది. కమల్ కపూర్, మధుబాలతో ‘అనార్కలి’ సినిమా ప్రకటించారు. అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. మొత్తానికి మధుబాలకు మాత్రం మొఘల్ ఏ ఆజమ్ లో హీరోయిన్ బెర్త్ కన్ఫర్మ్ అయ్యింది. ఈ విషయం ఇలా ఉంటే 1953లోనే మరో అనార్కలికి తెరలేచింది. ఇందులో అజిత్, మీనాకుమారి హీరోహీరోయిన్లు. ఇది కూడా కమల్ ఆమ్రోహి ఘనకార్యమే. ఆసిఫ్ ఊరుకోలేదు. గట్టిగా పట్టుబట్టడంతో ఆ ప్రాజెక్టు కూడా ఆగిపోయింది.

ఎనిమిదేళ్ల పాటు నిర్మాణం

మొఘల్ ఏ ఆజమ్ సినిమా నిర్మాణానికి ఎనిమిదేళ్లు పట్టిందంటే ఎవరైనా నమ్మగలరా? ఎన్నో అవాంతరాల నడుమ ఎనిమిదేళ్లకు గానీ ఆ సినిమా విడుదల కాలేదు. ఆగస్టు 5వ తేదీ 1960లో విడుదలైంది. ముంబయిలోని మరాఠా మందిర్ ని ఆగ్రా కోట మాదిరిగా ముస్తాబు చేసి మరీ ఈ సినిమాని అందులో విడుదల చేశారు. ఈ సినిమా ప్రివ్యూ ఇందులోనే వేశారు. అయితే హీరోహీరోయిన్లు దిలీప్ కుమార్, మధుబాల హాజరుకాలేదట. దానికి ఆసిఫ్ తో ఉన్న వ్యక్తిగత విభేదాలు కారణమయ్యాయి.

రాజ్ కపూర్, షమ్మీ కపూర్ లు మాత్రం ప్రివ్యూకు వచ్చారు. ఆసిఫ్ తో దిలీప్ వివాదానికి కారణం ఆయన చెల్లెల్ని ఆసిఫ్ దొంగతనంగా పెళ్లి చేసుకోవడమే. ఆ సినిమా ఘన విజయం సాధించినా దిలీప్ కుమార్ కూ, ఆసిఫ్ కూ కొన్నేళ్లుగా మాటలు లేవు. మధుబాల రాకపోవడానికి కూడా ఆమెకు సంబంధించిన వ్యక్తిగత అంశమే కారణం. ఇంతకీ ప్రివ్యూలో వచ్చిన టాక్ ఏమిటో తెలుసా? సినిమా ఫ్లాప్. దీని నిర్మాణానికి దాదాపు కోటి 25 లక్షల ఖర్చయింది. ఆ డబ్బంతా బూడిదలో పోసిన పన్నీరుగా భావించారు. అలా అందరూ అనుకున్న దానికి భిన్నంగా ఫలితం వచ్చింది. అదే మరాఠా మందిర్ లో మూడేళ్లు ఆడింది.

మన తెలుగులో పరిస్థితి ఏమిటి?

ఈ సినిమాలో మన తెలుగుదనం కూడా ఉంది. ఇందులోని దుర్జన్ సింగ్ పాత్రను పోషించిన అజిత్ హైదరాబాద్ నివాసే. అలాగే జహార్ పాత్ర పోషించిన నిగర్ సుల్తానా కూడా తెలుగువాడే. ఈ సినిమాలో రుమ్రీలు ఆలపించిన గులాం అలీఖాన్ సాబ్ లు కూడా హైదరాబాద్ వారే. ఇక్కడి ప్యారడైజ్, ప్యాలెస్ లలతో ఈ సినిమా విడుదలైంది. మరో విశేషమేమిటంటే ఇందులో వినియోగించిన ఆభరణాలను తయారు చేసిన వారు కూడా మన హైదరాబాదీలే. సినిమా నిడివి కూడా చాలా ఎక్కువ. లతామంగేష్కర్ పాడిన రెండు పాటల్ని సినిమా విడుదలైన కొంతకాలం తర్వాత సినిమాలో చేర్చారు. ఇలాంటి విశేషాలు ఎన్నో ఈ సినిమా గురించి చెప్పుకోవచ్చు.

మనకు తెలియని విషయాలెన్నో..

ఈ సినిమాపై ఓ ఐఆర్ఎస్ మాజీ అధికారి రవి పాడి పరిశోధన చేశారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఓ పాటకు వేణుగాన విద్వాంసుడు పన్నాలాల్ ఘోష్ వేణుగానాన్ని అందించారు. ఓ ఔట్ డోర్ షూటింగుకు రానని హీరోయిన్ మధుబాల మొండికేసిందట. దాంతో ఆమె స్థానంలోకి వైజయంతీమాలను తీసుకుని షూటింగు చేశారట. చివరికి ఈ విషయం కోర్టు దాకా వెళ్లింది. మధుబాలకు వ్యతిరేకంగా దిలీప్ కుమార్ సాక్ష్యం చెప్పడంతో వారి ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టిందని కూడా చెబుతుంటారు. అయినా సరే ఈ పాత్రల్లోని రొమాన్స్ ను బాగా పండించారు.

ఇంకా దిలీప్ కుమార్ గురించి చెప్పాలంటే తన సొంత సినిమా గంగాజమునతోపాటు దేవాదాస్ కు కూడా కాల్షీట్లు ఇచ్చేశారు. ఇలా వేర్వేరు పాత్రల స్వభావాలను ఒకే సమయంలో చేస్తూ పండించడం గొప్ప విషయం. ఇక దర్శకుడు ఆసిఫ్.. ఓ టైలర్ గా తన జీవితాన్ని ప్రారంభించారు. దర్శకుడిగా, నిర్మాతగా 16 ఏళ్ల పాటు తను కన్న కలల కోసం అహర్నిశలు శ్రమించారు. ఈ సినిమాలో శీష్ మహల్ సెట్ కు చాలా ప్రత్యేకత ఉంది. అప్పటి ప్రధాని నెహ్రూ కోరిక మేరకు డాక్యుమెంటరీల చిత్రీకరణకు ఇటలీ నుంచి వచ్చిన రాబెర్టో రొజిలిని ఈ సెట్ కు రూపకల్పన చేశారు. ముంబయిలోని మోహన్ స్టూడియోలో ఈ సెట్ వేశారు.

మరో విశేషమేమిటంటే ఈ సెట్ ను విడగొట్టి తన సోదరి పెళ్లిని అందులో జరిపించారు హాస్యనటుడు మహమూద్. ఇంతటి ప్రత్యేకతలున్న ఈ సినిమాలో నటించే అవకాశం రావడం దిలీప్ కుమార్ అదృష్టం. ఆయనకు ఇప్పుడు 98 ఏళ్లు. ఈ సినిమా 60 ఏళ్ల ఉత్సవాన్ని పూర్తిచేసుకుంది. ఈ డిసెంబరు 11వ తేదీ ఆ మహానటుడి పుట్టిన రోజు సందర్భంగా ‘మొఘల్ ఏ ఆజమ్’ సినిమా గురించి, ఈ సినిమా ప్రత్యేకత గురించి తెలుసుకోవడం కంటే మనకు ఏం కావాలి. నటన అనే కీర్తి కిరీటంలో మకుటాయమానం వెలిగిపోయే సినిమా ఇది.

– హేమసుందర్ పామర్తి

Must Read ;- దేవదాసు.. ఇది క్లాసిక్ మాత్రమే కాదు, ఓ చరిత్ర

Tags: actor dilip kumaractor dilip kumar deadDilip Kumardilip kumar moviesdilip kumar mughal e azamdilip kumar newsdilip moviesEditorspickmughal _e azam moviemughal _e azam movie castmughal _e azam movie hero dilip kumarmughal _e azam movie storymughal e azam meaningSpecial Story On Dilip Kumar
Previous Post

ఒక్క ట్వీట్ తో హీట్ పెంచేసిన హరీష్ శంకర్

Next Post

‘పుష్ప’లో రష్మిక షాక్ ఇస్తుందట

Related Posts

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

by లియో డెస్క్
September 10, 2026 5:11 pm

కూటమి ప్రభుత్వం పారదర్శకంగా చేపడుతున్న మెగా DSC ఉపాధ్యాయ నియామకాలను అడ్డుకోవాలని చూస్తున్న...

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

by లియో డెస్క్
September 9, 2026 7:21 pm

ఉత్తరాంధ్ర రాజకీయం మారుతోంది. ఉమ్మడి విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు జడ్పీ ఛైర్మన్‌...

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

by లియో డెస్క్
September 9, 2026 5:29 pm

రాజకీయ కక్షసాధింపు చర్యలు ఏ స్థాయికి దిగజారతాయో చెప్పడానికి మూడేళ్ల క్రితం జరిగిన...

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

by లియో డెస్క్
September 9, 2026 4:23 pm

ఉత్తరాంధ్రలో వైసీపీకి బిగ్‌షాక్ తగిలింది. వైసీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, ZP ఛైర్మన్...

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

by లియో డెస్క్
September 8, 2026 7:52 pm

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి పనుల వేగం చూసి...

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

by లియో డెస్క్
September 8, 2026 6:04 pm

DSC నియామకాలపై సోషల్ మీడియా వేదికగా YCP, బ్లూ మీడియా కొద్ది రోజులుగా...

పోలవరం LMC, వెలిగొండ పూర్తి..పీక్స్‌కి చంద్రబాబు గ్రాఫ్!

by లియో డెస్క్
September 8, 2026 4:58 pm

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు తిరిగేసరికి, సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో...

నన్ను కెలకొద్దు.. జగన్‌ కోటరీకి విజయసాయి వార్నింగ్..

by లియో డెస్క్
September 8, 2026 4:12 pm

  వైసీపీకి దూరమైన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటనతో రాష్ట్ర...

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

by లియో డెస్క్
September 7, 2026 10:40 pm

ప్రత్యర్దులు నీతులు పాటించాలి.. మేము మాత్రం అక్రమాలు చేసి బూతులు తిడతాం.. ఆధారాల్లేని...

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

by లియో డెస్క్
September 7, 2026 7:20 pm

కూటమి ప్రభుత్వంపై బురద జల్లడానికి మెగా డీఎస్సీపై రోజుకో కుట్ర చేస్తున్న వైసీపీ.....

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

పోలవరం LMC, వెలిగొండ పూర్తి..పీక్స్‌కి చంద్రబాబు గ్రాఫ్!

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

‘వెలిగొండ’పై ఆందోళ‌న మొద‌లైంది!

Lavanya Tripathi

ముఖ్య కథనాలు

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

నన్ను కెలకొద్దు.. జగన్‌ కోటరీకి విజయసాయి వార్నింగ్..

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

పోలవరం LMC, వెలిగొండ పూర్తి..పీక్స్‌కి చంద్రబాబు గ్రాఫ్!

నన్ను కెలకొద్దు.. జగన్‌ కోటరీకి విజయసాయి వార్నింగ్..

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

పోలవరం LMC, వెలిగొండ పూర్తి..పీక్స్‌కి చంద్రబాబు గ్రాఫ్!

నన్ను కెలకొద్దు.. జగన్‌ కోటరీకి విజయసాయి వార్నింగ్..

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist