Director Harish Shankar Raised The Heat With A Single Tweet About Pawan Kalyan Upcoming Movie :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్. ఈ సినిమా పవన్ ఫ్యాన్స్ నే కాకుండా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. పవన్ కెరీర్ లో ఎప్పటికీ మరచిపోలేని సినిమాగా నిలిచింది. మళ్లీ ఈ కాంబినేషన్ లో ఎప్పుడు సినిమా వస్తుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు పవన్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో మూవీ అనౌన్స్ చేయడంతో అభిమానులు ఆనందానికి అవధులు లేవని చెప్పచ్చు.
అయితే.. ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎలాంటి కథతో సినిమా ఉంటుంది? పవన్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది..? అనేది ఆసక్తిగా మారింది. ఇటీవల.. గబ్బర్ సింగ్ -2 తీస్తున్నారా? అన్న ప్రచారం ప్రారంభమైంది. ఇలాంటి టైమ్ లో హరీష్ శంకర్ మరో వేడెక్కించే ఆసక్తికర విషయాన్ని ట్విటర్ వేదికగా రివీల్ చేశారు. పీఎస్ పీకే 28వ చిత్రం పవర్ ఫుల్ గా ఉంటుందని రివీల్ చేశారు. అంతే కాకుండా ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు. పవన్ గత సినిమాల్లో పవర్ ఫుల్ యాక్షన్ సన్నివేశాలన్నింటినీ కలిపి ఓ వీడియో చేశారు. ఇప్పుడా వీడియో అభిమానుల్లో హీట్ పెంచేసింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఆ వీడియోను చూసిన మెగా హీరో సాయిధరమ్ తేజ్.. వెయిటింగ్ అంటూ రిప్లై ఇవ్వడం విశేషం. ఈ సినిమా అప్ డేట్స్ కోసం అభిమానులు వెయిట్ చేయడమే కాకుండా వాళ్లే టైటిల్ పోస్టర్ డిజైన్ చేసి రిలీజ్ చేశారు. దీని పై హరీష్ శంకర్ స్పందించారు ‘సరైన సమయం చూసి మేమే రిలీజ్ చేస్తాం. అప్పటి వరకు ఆడియన్స్ ని కన్ ప్యూజ్ చేయద్దు.. ఇలాంటి పోస్టర్స్ రిలీజ్ చేయొద్దు’ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు పవన్ చేస్తున్న సినిమాల్లో బాగా క్రేజ్ ఉన్న మూవీ అంటే… హరీష్ శంకర్ మూవీ అని చెప్పచ్చు. ఈ అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మరి… హరీష్ శంకర్ అంచనాలను ఎంత వరకు అందుకుంటారో..? ఎలాంటి రికార్డులు సెట్ చేస్తారో చూడాలి.
Must Read ;- మెగా కాంపౌండ్ లో హరీష్ మరో ప్రయాణం











