స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప. ఆర్య, ఆర్య 2 తర్వాత అల్లు అర్జున్ – బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రమిది. ఇందులో అల్లు అర్జున్ – రష్మిక జంటగా నటిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు. పుష్ప ఫస్ట్ పార్ట్ షూటింగ్ చివరి దశలో ఉంది. తాజా షెడ్యూల్ ను మంగళవారం ప్రారంభించారు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపధ్యంలో సాగే ఈ కథలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా నటిస్తుంటే.. రష్మిక పల్లెటూరి అమ్మాయిగా నటిస్తోంది.
అయితే.. ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది రష్మిక. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తోంది. ఈ అమ్మడు పుష్ప మూవీలో నటిస్తుందని తెలిసినప్పటి నుంచి.. ఆమె పాత్ర ఎలా ఉంటుంది..? అనేది ఆసక్తిగా మారింది. అయితే.. ఇటీవల ఓ ఇంటర్ వ్యూలో తన పాత్ర గురించి అసలు విషయం బయటపెట్టింది. ఇంతకీ రష్మిక ఏం చెప్పిందంటే.. ‘ఇందులో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. పల్లెటూరి అమ్మాయిగా.. చాలా నేచురల్ గా కనిపిస్తాను. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది.
ఇంకా చెప్పాలంటే… ఇంత వరకు చేయని పాత్ర ఇది. ఇందులో పర్ ఫార్మెన్స్ కి స్కోప్ ఉంది. నా క్యారెక్టర్ ఆడియన్స్ కి షాక్ ఇస్తుంది’ అని చెప్పింది. మరో విషయం ఏంటంటే.. పుష్ప రెండు భాగాల్లోను కనిపిస్తాను. తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుందని చెప్పింది. రష్మిక మాటలతో పుష్ప సినిమా పై మరింత ఆసక్తి ఏర్పడింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పుష్ప మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సంవత్సరం చివరిలో పుష్ప ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి.. త్వరలో పుష్ప రిలీజ్ పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
Must Read ;- ఆ.. విషయంలో చాలా బాధగా ఉందంటున్న రష్మిక











