రామ్‌గోపాల్ వర్మ.. అస్సలు ఏమాత్రం పరిచయం అవసరం లేని పేరు ఇది. సినిమాలు చూసేవారికే కాదు.. చూడని వారికి కూడా ఈ పేరు పరిచయమే. వివాదాస్పద సినిమాలను తెరకెక్కిస్తూ, వివాదాస్పద దర్శకుడిగా రామ్‌గోపాల్ వర్మ నిత్యం వార్తల్లో ఎక్కుతుంటారు. మిగతావారికి నచ్చని.. తనకు మాత్రమే నచ్చిన పనిని చేస్తూ, ఎవరు ఏమనుకుంటే నాకేంటీ.. డోంట్‌కేర్.. అంటూ తనకు నచ్చిన యథార్ధ ఘటనలను ఆధారంగా చేసుకుని సినిమాలుగా తీస్తుంటారు. ఆ సినిమా హిట్టవుతుందా లేదో పక్కనబెడితే సినిమా టైటిల్ డిసైడ్ అయిన దగ్గర నుంచి బొమ్మ రిలీజ్ అయ్యేంత వరకూ అన్ని వివాదాలే చుట్టుముడుతుంటాయి.
సమాజంలో జరిగిన, వాస్తవిక సంఘటనలను ఆధారంగా చేసుకొని తనకు నచ్చిన కథాంశాన్ని జోడించి ఆర్‌జివి సినిమాలు తీస్తుంటారు. గతంలో ఇలా ఆయన చాలా సినిమాలే తీచారు. తాజాగా మరికొన్ని సినిమాలను ఆయన తీస్తున్నారు. మిర్యాలగూడలో జరగిగిన పరువు హత్య నేపథ్యంలో మర్డర్ సినిమాతోపాటు 2019 నవంబర్ నెలలో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో దిశ అత్యాచార సంఘటనపై దిశ ఎన్‌కౌంటర్ అని సినిమాను తీయబోతున్న సంగతి తెలిసిందే.
దిశ తండ్రి ఆందోళన…
ఇప్పటికే దిశ అత్యాచార ఘటనకు ఆధారంగా తెరకెక్కుతున్న దిశ ఎన్ కౌంటర్ సినిమా పోస్టర్, ట్రైలర్‌ను వర్మ విడుదల చేశారు. ఈక్రమంలో దిశ తండ్రి ఈ సినిమాను ఆపాలంటూ తెలంగాణ హైకోర్టును శనివారం ఆశ్రయించారు. తాజాగా ఆదివారం దిశ తండ్రి శ్రీధర్.. హైదరాబాద్‌లోని రామ్‌గోపాల్ వర్మ ఆఫీసు ఎదుట దిశ ఎన్‌కౌంటర్ సినీమాను బ్యాన్ చేయాలంటూ కుటుంబ సభ్యులు, మహిళా సంఘాలతో కలిసి ఆందోళన చేపట్టారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు.
ఈ సంధర్భంగా దిశ తండ్రి శ్రీధర్ మాట్లాడుతూ దిశ ఎన్‌కౌంటర్ సినీమాను ప్రభుత్వం బ్యాన్ చేయాలని కోరారు. సినిమా ట్రైలర్‌కు వస్తున్న కామెంట్లు చూస్తుంటే తమకు చాలా బాధేస్తుందని వాపోయారు. ఇప్పటికే తాము కూతుర్ని పోగొట్టుకుని పుట్టెడు దుఖంలో ఉన్నామని, ఆ సంఘటనకు ఆధారంగా చేసుకొని సినిమా తీయడం తమకు మరింత మనోవేదనను గురిచేస్తుందన్నారు. మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఇలా జరిగితే సినిమాలు తీస్తారా అని ప్రశ్నించారు. వర్మ తీస్తున్న సినిమాపై మహిళా సంఘాలు కూడా మండిపడ్డాయి. వర్మకార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళన కారులను పోలీసులు అడ్డుకున్నారు. అలాగే దిశపై యూట్యూబ్‌లో వస్తున్న అనుచిత వార్తలనుతొలగించేలా చర్యలు తీసుకోవాలని దిశ తండ్రి ప్రభుత్వాన్ని కోరారు.
క్లారిటీగా చెప్పిన ఆర్‌జివి..
తను తీస్తున్న దిశ ఎన్‌కౌంటర్ సినిమాపై దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ శనివారం క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేశారు. దిశ సినిమాను బ్యాన్ చేయాలంటూ వస్తున్న నిరసనలపై ఆయన స్పందించారు. అనేక కేసుల ఆధారంగా ఈ ఇనిమాను తీస్తున్నట్లు తెలిపారు. నిర్భయ అత్యాచార ఘటన నుంచి అనేక ఇతర కేసుల ఆధారంగా నిర్మిస్తున్న ఒక కల్పిత కథ అని ఆయన ట్విట్టర్‌లో స్పందించారు.
2019లో దిశ అత్యాచార ఘటన..
గతేడాది 2019 నవంబర్‌లో మానవ మృగాలు నలుగురు అతిదారుణంగా అత్యాచారం చేసి ఆ తరువాత హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో నలుగురు నిందితుల్ని అరెస్టు చేసిన పోలీసులు అనంతరం వారు ఎన్‌కౌంటర్‌లో బలిఅయ్యారు. పోలీసు చర్యపై అప్పట్లో భిన్నాబిప్రాయాలు వెలువడ్డాయి. కొందరి ఈ ఎన్ కౌంటర్ను సమర్ధిస్తే మరొ కొందరు ఇది సరైన చర్య కాదని విమర్శలు గుప్పించారు.
ఈక్రమంలో దిశ సంఘటన, దిశ అత్యాచారం ఘటనపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో కేసు విచారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో సినిమాను తెరకెక్కించడం ఆపాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. దీంతో సినిమా ఆపాలని సినిమా సెన్సార్ బోర్డుకు, కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం అందించాలని దిశ కోర్టుకు కోర్టు సూచించింది.ఈక్రమంలో రామ్‌గోపాల్‌వర్మ ఆఫీసు వద్ద దిశతండ్రి ఆందోళన చేపట్టారు. దిశ ఎన్‌కౌంటర్ సినిమాను ఆపాలనే దిశ తండ్రి ప్రయత్నం ఎంతవరకు సఫలం అవుతుందో లేదో చూడాలి మరి.











