సీఎం జగన్ కుట్ర ప్రకారం జైలు జీవితాన్ని గడుపుతున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు భద్రతపై ఆ పార్టీ నేతలు, కేడర్ మొదటి నుంచి సందేహాలు వ్యక్తం చేస్తోంది. బాబు భద్రతకేమీ భయం లేదని అటు అధికారులు, ఇటు ప్రభుత్వం పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తోంది. కానీ రాజమండ్రి జైల్లో జరుగుతున్న తాజా పరిణామాలు చూస్తుంటే మాత్రం అధికారులు, ప్రభుత్వం చెబుతున్న మాటలు నమ్మశక్యంగా లేవు. ఓ జాతీయ నేతకు భద్రతకు కల్పించే తీరు విషయంలోనూ ప్రభుత్వ చేపట్టిన చర్యలు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి.
రాజమహేంద్ర వరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు కోసం కొంత మంది ఖైదీలను వేరే చోటకు మార్చి స్నేహ బ్యారెక్ మొత్తాన్ని ఆయనకు కేటాయించారు. కోర్టు నిబంధనలు పాటిస్తున్నామని, ఆయన భద్రతకేమీ ఢోకా లేదని జైలు అధికారులు చెబుతున్నారు. అయితే గత నెల్లో అదే జైల్లో జరిగిన గొడవ ఇప్పుడు చంద్రబాబు భద్రతపై ఆందోళన వ్యక్తం చేసేలా ఉంది.
గంజాయి అక్రమ రవాణా కేసులోఅదే జైల్లో ఖైదీగా ఉన్న విజయవాడ వాసి నవీన్ రెడ్డి తీవ్ర గాయాల పాలయ్యాడు. ఈ విషయాన్ని అధికారులు, ప్రభుత్వం రహస్యంగా ఉంచింది.
తర్వాత తీరిగ్గా రాజమండ్రి నుంచి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తోంది. దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటనా లేదు.
ఈ వ్యవహారం మీడియాకు చేరటంతో జైలు అధికారులు అలర్టయ్యారు. నోటికొచ్చిన సమాధానం చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తోపులాటలో ఖైదీ గాయపడితే 15 రోజుల పాటు ఆ విషయాన్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరమేముందన్న ప్రశ్నలకు మాత్రం ఎవరూ సమాధానం చెప్పటం లేదు.
ఖైదీల మధ్య తోపులాట వ్యవహారం వెలుగులోకి రావటంతో చంద్రబాబు భత్రతపై టీడీపీ శ్రేణులు మరో సారి ఆందోళకు సిద్ధమవుతున్నాయి. ఆయనకు సరైన రక్షణ కల్పించే విషంయంలో కోర్టు జోక్యం చేసుకోవాలని కోరుతూ టీడీపీ పిటీషన్ దాఖలు చేయబోతుంది .జైల్లో ఉన్న అభద్రతా పరిణామాల దృష్ట్య్యా అయినా చంద్రబాబుకు బెయిలిప్పించాలని పలువురు టీడీపీ నేతలు న్యాయస్థానానికి విజ్ఞప్తి చేస్తున్నారు.











