చేసిన పాపం ఊరికే పోదంటారు. ఆ పాపం జన్మజన్మలూ వెంటాడుతుందని అందరూ చెప్పేదే. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏపీలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఏం చేస్తే ఈ పాపం పండుతుందోనని ప్రజలు దేవుళ్లకు మొక్కుకుంటూ తగిన శాస్తి
చెప్పేందుకు సిద్ధమవుతున్నారు.
రాష్ట్రం విడిపోయాక ఎన్నో సమస్యలు ఎదురైనా చంద్రబాబు సమర్థవంతమైన పాలనను అందించి ఆంధ్రప్రదేశ్‌ను కుదుటపరిచేలా చేశారు. అయితే వైఎస్సార్ సీపీ హయాంలో జగన్ పాలన అందుకు భిన్నంగా సాగుతోంది. కుట్ర, కుతంత్రం, హత్యారాజకీయాలు జగన పాలనలో సర్వసాధారణమైపోయాయి. ఏదో రకంగా తెలుదేశం పార్టీ నేతలను ఇబ్బందులకు గురి చేసి వారిని జైలు పాలు చేయటం లేదా, భయంతోరాజకీయాలకు దూరం చేయటం జగన్ పాలనకు పరాకాష్ఠ. రాష్ట్రమంతా ఈ పరిణామాలు సర్వసాధారణమైపోయాయి. జగన్ సైకో పాలనకు అలవాటు పడ్డ జనం మంచి రోజులు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తోంది.
జగన్ కుట్ర రాజకీయాలకు సోషల్ మీడియాను సైతం ఉపయోగించుకుంటున్నారు . అసత్యాలను నిజం చేయటం, వాస్తవాలను దాచిపెట్టడంలో జగన్ సోషల్ మీడియా రాటుదేలిపోయింది. ఇప్పటికే పలు రకాల కేసుల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ఇరికించి కష్టాలు పాలు చేసిన వైసీపీ ఆయనపై మరో కుట్రకు పకడ్బందీ వ్యూహం రచిస్తోంది. వైసీపీ సోషల్ మీడియాలో చంద్రబాబుకు వ్యతిరకంగా కొత్త కుట్ర సాగుతోంది. చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన నీరు చెట్టు పథకంలో 7036 కోట్ల పనులు జరిగితే.. 34399 కోట్ల అవినీతి జరిగిందని ఆ పార్టీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది. ఈ విష ప్రచారాన్ని బలపరుస్తూ అనేక ఆరోపణలు చేస్తోంది. ఇందులో అప్పటి మంత్రి దేవినేని ఉమ, పలువురు అధికారులను ఇరికించే ప్రయత్నం చేసి వేధించేందుకు సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం మొదలుపెట్టింది.
తాను నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి పాలన సాగించిన చంద్రబాబుపై రోత రాతలు రాస్తూ జనం నుంచీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీకి చరమగీతం పాడే రోజు త్వరలోనే ఉందని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. ఇలాంటి వారికి తగిన బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే రాబోతున్నాయంటున్న ఆ పార్టీ నేతలు వైసీపీ సోషల్ మీడియాపై ఫిర్యాదు చేయబోతున్నారు. ఇలాంటి రాతలు, అసత్య ప్రచారాలు చేస్తోన్న వారికి అధికారంలోకి రాగానే తగిన బుద్ధి చెబుతామంటూనే ఈ వ్యవహారంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయబోతున్నారు.