తమకున్న రెండెకరాలు భూమి కబ్జా చేశారని, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ తండ్రీ కొడుకులు ఆత్మహత్యాయత్నం చేశారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం కంచర్ల గ్రామానికి మల్లారెడ్డి, అతని కొడుకు నితిన్‌రెడ్డిలు బిక్కనూరు తహశీల్దార్ ఆఫీస్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. తమ రెండెకరాల భూమిని కబ్జా చేశారని, పోలీసులు, రెవెన్యూ అధికారులు కబ్జాదారుడికి వత్తాసు పలుకుతున్నారని వారు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో అధికారులు అడ్డకుని వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
బొత్స టీమ్ టీడీపీలోకి జంప్.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!
ఐదేళ్ల జగన్ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్ గుర్తును...











