మాస్ మహారాజా రవితేజా ప్రస్తుతం ‘క్రాక్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇందులో యాంగ్రీ పోలీసాఫీసర్ గా నటిస్తుండగా.. రాక్షసుడు ఫేమ్ రమేశ్ వర్మ దర్శకత్వంలో మరో సినిమానూ లైన్ లో పెట్టుకున్నాడు. హవీష్ ప్రొడక్షన్ బ్యానర్ పై కోనేరు సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. రవితేజ మలయాళ సూపర్ హిట్ చిత్రం‘ డ్రైవింగ్ లైసెన్స్’ రీమేక్ లో కూడా నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. తాజాగా రవితేజ మరో సినిమాకి కూడా కమిట్ మెంట్ ఇచ్చాడని టాక్.
రవితేజతో సినిమా తీయాలని ఎప్పటినుంచో అనుకుంటున్న దర్శకుడు మారుతి.. రీసెంట్ గా ఆయనకి ఒక కథ చెప్పాడట. దానికి బాగా ఇంప్రెస్ అయిన రవితేజ.. ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఎర్లియర్ గా ‘ప్రతిరోజూ పండగ’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మారుతి.. ఈ సినిమాని కూడా పూర్తి వినోదభరితంగా తెర కెక్కించనున్నాడట. కాగా.. ఇందులో రవితేజ లాయర్ గా నటించబోతున్నట్టు వినికిడి. జాలీ యల్.యల్.బీ తరహాలో చక్కటి సందేశం కూడా ఉండబోతోందట. యూవీ క్రియేషన్స్ , గీతా 2 సంయుక్త బ్యానర్ లో అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ సినిమాలో రవితేజ ఏ రేంజ్ లో కామెడీగా వాదిస్తాడో చూడాలి.