జేసీ ప్రభాకర్ రెడ్డి సంబరాలు కారణం అదేనా …!
అనంతపురం జిల్లా తాడిపత్రి .. పొలిటికల్ హీట్ కు కేరాఫ్! రాజకీయాలే కాదు.. కొన్ని చర్యలు పూర్తి వివాదస్పదంగా మారి కత్తులు దూసుకోవడం ఇక్కడ సర్వసాదారణం! సరిగ్గా ఏడాది క్రితం తాడిపత్రిలో వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇసుక వివాదంలో వార్నింగ్ ఇచ్చేందుకు జేసీ ప్రభాకర్ ఇంటికి వెళ్లాడు. ఆ నాడు రాజుకున్న రాజకీయ మంటలు.. 15 రోజులు పాటు తాడిపత్రిని కాల్చివేశాయి. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అది ఒకందుకు జేసీకి బాగా కలిసొచ్చింది. అందుకే సంబరాలు చేశారు.
డిసెంబర్ 24, 2020 నుంచి టీడీపీ ఫుల్ యాక్టీవ్ గా మారింది..!
డిసెంబర్ 24, 2020న జేసీ ఇంటిపై పెద్దారెడ్డి మంది మార్బలంతో వచ్చి దాడికి యత్నించగా.. టీడీపీ శ్రేణులు ప్రతిఘటించాయి. ఆ ఘటనతో టీడీపీ తాడిపత్రిలో ఫుల్ యాక్టీవ్ అయింది. అధికార పార్టీ అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. అంతేకాక అప్పుడు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధిచారు. ఏపీలో ఒక్క తాడిపత్రి మినహా మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఎక్కడ విజయం సాధించలేకపోయింది. తాడిపత్రిలో టీడీపీ గెలుపుతో తమ ప్రాంతంలో స్వాతంత్య్రం వచ్చిందని గుర్తు చేసుకుంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి శుక్రవారం తన నివాసంలో సంబరాలు చేసుకున్నారు. కార్యకర్తల నడుమ భారీ కేక్ ను కట్ చేసి, విందు భోజనం అందించారు.











