విద్యార్థులందర్ని పాస్ చేస్తున్నట్లు నిర్ణయం..!
ఇంటర్ ఫస్ట్ ఇయర్ జనరల్ విభాగంలో మొత్తం 4,09,991 మంది పరీక్షలకు హాజరవ్వగా.. కేవలం 1,99,756 మంది మాత్రమే పాస్ అయ్యారు. ఒకేషనల్ విభాగంలో కూడా 49,331 మంది పరీక్షకు హాజరవ్యగా కేవలం 24,226 మంది మాత్రమే పాస్ అయ్యారు. మొత్తం మీదా 49 శాతం మంది విద్యార్థులు పాస్ అవ్వగా .. 51శాతం మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. గతంలో టాప్ ర్యాకు సాధించిన విద్యార్థులు కూడా ఫెయిల్ అవ్వడంతో ప్రభుత్వ తీరుపై సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో విద్యార్థి సంఘాలు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. దీని త్వరగా నిర్ణయం తీసుకోకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. దీంతో కేసీఆర్ ప్రభుత్వ పునరాలోచనలో పడింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని శుక్రవారం ప్రకటించారు. ఫెయిల్ అయిన విద్యార్థులందరిని 35 మార్కులు వేసి పాస్ చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. వచ్చే పరీక్షల్లో విద్యార్థులందరూ బాగా చదివి, మంచి మార్కులు సాధించాలని కోరారు.











