పవన్, నాని లు మీ రెమ్యునరేషన్ ఎంతో చెప్పండి? – మంత్రి అనిల్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హీరో నాని లు వారి రెమ్యునరేషన్ తగ్గించుకొని ప్రజలకు వినోదాన్ని ఫ్రీగా పంచవచ్చుకదా? అని మంత్రి అనిల్ కుమార్ విమర్శలు గుప్పిచారు. టికెట్ల ధరలపై నిన్న హీరో నాని చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స, కన్నబాబు, కొడాలి నాని, మల్లాది విష్ణు వంటి వారు స్పందించగా .. తాజాగా శుక్రవారం మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా స్పందించారు. ఏపీలో టికెట్ ధర తగ్గిస్తున్నారని హీరోలు బాధపడడానికి కారణంగా హీరోల రెమ్యునరేషన్ ఎక్కడ తగ్గుతోందనన్న బాధతో మాట్లాడుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. భీమ్లా నాయక్, వకీల్ సాబ్ వంటి చిత్రాలకు నిర్మాతలు పెట్టిన ఖర్చు ఎంతా? పవన్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతా? అని ప్రశ్నించారు. పవన్ తన క్రేజ్ ను అమ్ముకుంటున్నారని విమర్శలు గుప్పించారు. హీరో నాని ఎవరో తనకు తెలయదని, కొడాలి నాని ఒక్కరే తెలుసని మంత్రి అనిల్ సెటైర్లు వేశారు. సినిమా నిర్మాణంలో 70శాతం రెమ్యునరేషన్ కే ఖర్చౌతోందని, హీరోలు అది తగ్గించుకుంటే టికెట్ ధరలు దిగొస్తాయని అనిల్ చెప్పారు. కోట్లాది మంది ప్రజలపై భారం పడుతోంది కాబట్టే సినిమా టికెట్ ధరల నియంత్రణ విషయంలో ఏపి ప్రభుత్వం వెనకడు వేయడం లేదని మంత్రి మరోసారి పునరుద్ఘాటించారు.