వైజాగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కిడ్నాప్ ఘటనతో ఉలిక్కిపడుతున్న వైసీపీ బడా నేతలు.. తాజాగా గన్ లైసెన్స్ కోసం అప్లై చేసుకుంటున్నారని సమాచారం
గత కొద్దీ కాలంగా ఆంధ్ర ప్రదేశ్ లో పరిస్థితుల్లో ఏమి బాగోలేవు దానికి కారణం అధికార పార్టీ ఎంపీ కుటుంబాన్ని కిడ్నమ్ చేయడమే ఒక నిదర్శనం అని తెలుస్తుంది. ఎంపీ కి సెక్యూరిటీ ఇవ్వలేని ప్రభుత్వం, సాధారణ ప్రజలకు ఎలా రక్షణ కల్పిస్తారు అని జనాలు ఆవేదన చెందుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఎపుడు ఏమి జరుగుతుందో అని తెలియక భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు. అధికార పార్టీ ఎంపీ కుటుంబ సభ్యులను అరెస్టు చేసి 48 గంటలపాటు కిడ్నాప్ చేశారన్న ఆరోపణలతో విశాఖపట్నంలో వైఎస్సార్‌సీపీ నేతలు టెన్షన్‌లో ఉన్నారు. దీంతో రాజకీయ నాయకులు, వ్యాపారులు ఆత్మరక్షణ కోసం ఆయుధాలు పొందేందుకు ప్రయత్నించడంతో తుపాకీ లైసెన్సుల కోసం దరఖాస్తులు చేసేందుకు ఊపందుకున్నాయి.
దానిలో భాగంగానే అధికార పార్టీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ భయాందోళనలకు గురయ్యారని, ఎప్పుడు ఎవరు దాడిచేస్తారో అని భయంతో సొంతపార్టీ నాయకులే ఇలాబయపడి గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటుంటే ఆంధ్ర ప్రదేశ్లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో యిట్టె అర్థమైపోతుంది. సొంత పార్టీ నాయకులే భయంతో తుపాకులకు లైసెన్స్ కి దరఖాస్తు చేసుకుంటుంటే, ఇదేం కర్మరా నాయన సొంత రాష్ట్రంలోనే సెక్యూరిటీ లేకపోతే అదీనూ అధికార మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకు దిక్కులేకపోతే ఎవరికి చెప్పుకోవాలి,రాష్ట్రాన్ని వైసీపీ పట్టిన కూర్మ అని సగటు సామాన్య ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కూడా గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. తుపాకీ లైసెన్స్ పొందడానికి, వ్యక్తులు పోలీసు శాఖ నుండి, అలాగే స్పెషల్ బ్రాంచ్ మరియు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ NOC పొందవలసి ఉంటుంది. YSRCP ప్రభుత్వంలోని నాయకులకు తగినంత భద్రత కల్పించే విషయంలో వైసీపీ ప్రభుత్వం ఫెయిల్ అయిందని, స్వంత ప్రభుత్వ సామర్థ్యంపై విశ్వాసం లేకపోవచ్చని తెలుస్తోంది.. ఎన్నికలకు ముందు ఎంపీ కుటుంబ సభ్యులు కిడ్నాప్‌కు గురికావడం ప్రజల్లోనూ ఆందోళన కలిగిస్తోంది. వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నంలో వైఎస్సార్‌సీపీకి ఎదురుదెబ్బ తగలడం ఖాయంగా కనిపిస్తుంది.