ఆంధ్ర ప్రదేశ్ లో వచ్చే సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడేకొడి పార్టీలు తమ అస్త్రాలను బయటకి తీస్తున్నారు.టీడీపీ పాదయాత్రలు, జనసేన వారాహి యాత్ర, వైసీపీ గడప గడపకి కార్యక్రమాలు తలపెట్టాయి. వైసీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గడప గడపకి ప్రోగ్రాంలో ప్రజల గదరికి వెళ్లిన వైసీపీ నాయకులకు ప్రజలు చుక్కలు చూపిస్తున్నారని చెప్పాలి, వైసీపీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చక పోగా,మంత్రులు, ఎమ్మెల్యేలు,వచ్చి హడావుడి చేస్తున్నారు తప్పితే ప్రజలకి ఉపయోగపడే ఒక్క పనికూడా ప్రభుత్వం అమలు చేయలేదని ప్రజలు వాపోతున్నారు.గత ఎన్నికల్లో వైసీపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు , నవరత్నాలు,సంక్షేమ పథకాలు , ప్రజలకి ఉపయోగ పడే ఏఒక్క పనిని కూడా చేయలేదని వైసీపీ నాయకులని నిలదీస్తున్నారు.
ఇదిలా ఉంటె గడప గడపకి కార్యక్రమం లో భాగంగా, రాష్ట్ర పురపాలక మంత్రి ఆదిమూలపు సురేష్ కు సొంత నియోజక వర్గం రామాసముద్రంలో నిరసన సెగలు తగిలాయి. రైతులకు ఇచ్చే ఉపకరణాలు పంపిణి జరిగాక, తిరిగి వెళ్తున్న క్రమంలో చేదు అనుభవ ఎదురైంది. ఏ మొకం పెట్టుకొని వచ్చారు అని మహిళలు చుట్టూ ముట్టారు, మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాక గ్రామంలోకి అడుగు పెట్టాలని, తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను తక్షణమే నెరవేర్చాలని వాళ్ళు డిమాండ్ చేసారు. సాగర కాలువ నుండి వచ్చే జలాలను పైపుల ద్వారా తాగునీటి సమస్యకు పరిస్కారం చూపాలని ఆవేదన వ్యక్తం చేసారు. ఊహించని పరిణామంతో కంగు తిన్న మంత్రి అక్కడనుండి నెమ్మదిగా జారుకున్నాడు.
వైసీపీ తల పెట్టిన గడప గడపకి కార్యక్రమం లో నిరసనలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఏ ఒక్క సంక్షేమ పథకాలు కూడా ప్రజలకి అందలేదని స్పష్టంగా తెలుస్తోంది, సంక్షేమ పథకాల పేరుతో వైసీపీ నాయకులే తమ జేబులు నింపుకున్నారని, ప్రజలకి వైసీపీ చేసిందేమి లేదని, గత టీడీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన పనులనే, వైసీపీ చేసిందని చెప్పుకొని తిరుగుతున్నారు వైసీపీ నాయకులు.











