పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్షలో ఉన్న సంగతి తెలిసిందే. అయినా ఖాళీ సమయాల్లో సినిమాలు చూస్తూనే గడుపుతున్నారట. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. తనకు బర్త్ డే విషెస్ చెప్పిన చాలా మంది ప్రముఖలకి తిరిగి విషెస్ చెప్పారు పవర్ స్టార్. వారిలో హీరో సత్యదేవ్ కూడా ఉన్నాడు, సత్యేదేవ్ కి థ్యాంక్స్ చెబుతూ, ఉమామహేశ్వర ఉగ్రరూపస్యలో మీ యాక్షన్ నచ్చిందని తెలిపారు. దీంతో సత్య దేవ్ హ్యాపినెస్ మాట అటు ఉంచితే, పవన్ కళ్యాణ్ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా చూశాడంటూ ప్రచారం ఊపందుకుంది.
నెట్ ఫ్లిక్స్ లో గతనెల విడుదలైన ఈ సినిమాను జనాలు ఆల్రెడీ చూసేసి మరిచిపోయారు, కానీ పవన్ ఇప్పుడు చేసిన ట్వీట్ మళ్లీ ఈ సినిమాను ఆడియెన్స్ కు గుర్తుకు వచ్చేలా చేసింది. దీక్షలో ఉండి కరోనా మహ్మమారి నుంచి ప్రజలని కాపాడమని కోరుకుంటున్నా అని చెబుతున్నా దాంతో పాటే ఖాళీ టైమ్ లో సినిమాలు చూస్తున్నారనే కామెంట్స్ ప్రస్తుతం హల్ చల్ చేస్తున్నాయి. రాజకీయాలతో పాటు సినిమాల్లో కూడా చురుక్కుగా ఉండేందుకు పీకే ప్రయత్నిస్తున్నారు. వకీల్ సాబ్ సినిమా పూర్తికాగానే ఒకే సారి మూడు సినిమాల్లో నటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తన నటన బాగుందంటూ పవన్ కితాబు ఇవ్వడంతో సత్యదేవ్ మురిసిపోయాడు. ఒక నటుడు మరో నటుడి సినిమాలను మెచ్చుకోవడం మంచి పరిణామం.