దర్శకుడు క్రిష్ ను కరోనా కష్టాలు చుట్టుముట్టినట్టే ఉన్నాయి. సినిమా అవకాశాలకేమీ తక్కువ లేదుగానీ అవి కార్యరూపం దాల్చడంలోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కూల్ గా తనపని తాను చేసుకుంటూ పోయే క్రిష్ కి గత రెండేళ్లుగా టైమ్ అస్సలు కలిసిరావడం లేదు. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రౌనత్ తో గొడవ పెట్టుకుని మళ్లీ టాలీవుడ్ కి వచ్చేసిన క్రిష్ కి గడ్డు పరిస్థితలు నెలకొన్నాయి.
యన్టీఆర్ బయోపిక్ ప్లాప్ అయిపోవడం, ఆ తరువాత పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ అనేక సార్లు పోస్ట్ పోన్ అవుతూ చివరకి మొదలైన సమయానికే కరోనా వచ్చి ఇండస్ట్రీ బంద్ అయిపోవడం వంటి అనేక ఇబ్బందలు క్రిష్ ని చుట్టుముట్టాయి. అయితే తాజాగా క్రిష్ పవన్ కళ్యాణ్ సినిమాతో పాటే మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ సినిమాను పట్టాలు ఎక్కించాడు. ఈ. సినిమాలో హీరోయిన్ గా రకుల్ ని తీసుకున్నాడు క్రిష్. అయితే ఇటీవల వికరాబాద్ ఫారెస్ట్ లో మొదలు పెట్టిన ఈ సినమా షూట్ ఆగిపోయింది.
ఈ చిత్ర యూనిట్ ఓ మెయిన్ మెంబర్ కి కరోనా రావడంతో షూటింగ్ ఆపేశారట నిర్మాతలు. దీంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న మాదిరిగా క్రిష్ వేసుకున్న ప్లాన్స్ ఒక్కొక్కటిగా ఫ్లాపులు అవుతూ వస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ సినిమాకి ఫైనాన్స్ ఇబ్బందలు ఉండటంతో నిర్మాత ఇప్పుడప్పుడే ఈ సినిమాను సెట్స్ మీదకి తీసురాలేడు, అయితే క్రిష్ మాత్రం ఈ సినిమాకి సంబంధించిన కొత్త వెర్షన్ పీకేకి నెరెట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.