రాష్ట్రంలో పాగా వేయడమే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ పావులు కదుపు తోంది. ప్రజా సమస్యలపై క్షేత్ర స్థాయి పోరాటాలకు సిద్ధమవుతోంది. గతానికి భిన్నంగా పార్టీ దూసుకెళ్తోంది. జాతీయ నాయకత్వంపచ్చజెండా ఊపేసిందో… బండి సంజయ్ స్వేచ్ఛనిచ్చారో తెలీదు కానీ పార్టీ నేతల మాటల్లో దూకుడు పెరిగింది. సబ్జెక్టుల వారీగా నాయకులు పోరాటాలకు సిద్ధమవుతున్నారు . రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగట్టేందుకు సమరోత్సాహం చూపిస్తున్నారు.
దూకుడు పెంచు..పంచ్ లు దంచూ…
గత నాయకత్వాల సమయంలో కేవలం పార్టీ కార్యాలయానికే పరిమితమైన నేతలు నేడు క్షేత్రస్థాయిలో పోరాటం మొదలు పెడుతున్నారు. ఏ సమస్య అయినా మాటలకే పరిమితం కాకుండా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ప్రజలతో కలిసి పోరాడుతున్నారు. అధికార పార్టీ నేతల విమర్శలకు ఏ ఒక్కరో సమాధానం చెప్పకుండా అవసరాన్ని బట్టి నేతలు కౌంటర్ లు ఇస్తున్నారు. అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలు తీసుకున్న వెంటనే అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్న డిమాండ్ తో చేపట్టిన ఒక రోజు దీక్ష మొదలు నేడు ఎల్ ఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాడే వరకు బీజేపీ అంతకంతకూ దూకుడు పెంచినట్టు కనిపిస్తుంది. రైతు సమస్యలే లక్ష్యంగా జనంలోకి చొచ్చుకు పోయే ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికల్లో పెద్దగా సీట్లు సంపాదించక పోయినా టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టడంలో విజయం సాధిస్తోంది. ఏ చిన్న సమస్య వచ్చినా బాధితులను కలిసేందుకు ఏకంగా అద్యక్షుడు బండి సంజయ్ రంగంలోకి దిగడం .. లేదంటే స్థానికంగా ఉండే నేతలను బాధితుల పక్షాన పోరాడేలా కేడర్ ను సిద్ధం చేశారు.
విమర్శల బాట…మాటల తూటా….
గతంలో ఉన్నట్టు ఏ సమస్యకైనా పలానా వారే మాట్లాడాలి అన్ని సంప్రదాయానికి చెక్ పెడుతున్నారు. రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం పెట్టాలన్నా గతంలో అనేక అడ్డంకులు ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థి లేదంటున్నారు పార్టీ నేతలు. ఇష్యూ బేస్ గా ఎవరు అందుబాటులో ఉన్నా వారు మాట్లాడే వెసులుబాటు కల్పిస్తున్నారు. ఓబీసీ విషయంలో గంగుల కమలాకర్ చేసిన విమర్శలపై స్ట్రాంగ్ కౌంటరే ఇచ్చారు బీజేపీ నేతలు.. ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్… గుంగల కమళాకర్ చేసిన ఆరోపణలను తిప్పి కొట్టారు. టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ పార్టీకి సైతం ఎప్పటికప్పుడు కౌంటర్ లు ఇస్తూ ప్రజల కు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. ప్రజల్లోకి వెళ్ళాలన్న తమ టార్గెట్ రీచ్ అవ్వాలన్నా పార్టీ కార్యాలయంలో కూర్చుని మాట్లాడితే సరిపోదని క్షేత్ర స్థాయిలో పోరుతోనే అధికార పీఠం దక్కించుకోవాలన్న బీజేపీ ఆలోచనలు సఫలం అవుతాయో… చివరికి వచ్చే సరికి చతికల పడుతుందో చూడాల్సిందే.
నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్ Vs బండ్ల గణేష్ కౌంటర్..!
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...











