హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం సినిమాలతో యూత్ ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు వరుణ్ సందేశ్. ఆపై ‘ఏమైంది ఈ వేళ’ సినిమాతో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత అన్నీ పరాజయాలు పలకరించడంతో .. వరుణ్ కొన్నాళ్లపాటు తెరకు దూరంగా ఉన్నాడు. ఇటీవల బిగ్ బాస్ మూడవ సీజన్ తో మళ్ళీ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇన్నాళ్ళ తర్వాత వరుణ్ సందేశ్ ఓ వెరైటీ ప్రేమకథా చిత్రంతో తెలుగు తెరపైకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
మూడేళ్ళ క్రితం ‘మర్ల పులి’ సినిమాతో ఆఖరి సారిగా తెలుగు తెరమీద కనిపించిన వరుణ్ సందేశ్ .. ప్రస్తుతం ‘వెన్నెల్లో వర్షం, ట్విస్ట్’ అనే రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. వాటితో పాటు కొత్త గా ఇప్పుడు ‘ఇందువదన’ అనే వెరైటీ లవ్ స్టోరీతో ప్రేక్షకులకు మంచి అనుభూతినివ్వబోతున్నాడు. యం.యస్.ఆర్ దర్శకత్వంలో శ్రీబాలాజీ పిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మాణం జరపుకుంటోంది. ఇటీవల ‘ఇందువదన’ టైటిల్ లోగోను ఆవిష్కించి..ధన్ రాజ్ తో ఒక వీడియో చేసిన టీమ్ .. త్వరలో ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయబోతోంది. మరి ‘ఇందువదన’ సినిమాతో వరుణ్ సందేశ్ .. ఏ రేంజ్ లో హిట్ అందుకుంటాడో చూడాలి.
Must Read ;- ఈ సారైనా టాలీవుడ్ కు సీక్వెల్ గండం తప్పుతుందా?