‘కొత్త బంగారులోకం’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది శ్వేతా బసు ప్రసాద్. వరుణ్ సందేశ్ తో కలిసి నటించిన ఈ సినిమాలో ఎక్కాడా.. అనే డైలాగ్ తో బాగా పాపులర్ అయ్యింది. కుర్రకారును బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత రైడ్, కళావర్ కింగ్ , ప్రియుడు లాంటి చిత్రాల్లో నటించింది. తెలుగుతో పాటు తమిళ్, బెంగాళీ, హిందీ చిత్రాల్లో నటించిన ఈ సుందరి తెలుగులో ఓ వెలుగు వెలుగుతుంది అనుకుంటే.. ఆశించిన స్ధాయిలో అవకాశాలు రాలేదు.
ఆమె ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. అయితే.. టైమ్ బాగోలేక జరిగిందో.. ఏమో కానీ.. ఆమె పర్సనల్ లైఫ్ లో ఊహించని కుదుపు. ఒక్కసారిగా ఆమె జీవితం తలకిందులైంది. చిన్న వయసే అయినా తట్టుకుని నిలబడింది. దీని నుంచి బయటపడింది. ఆ తర్వాత తన స్నేహితుడైన డైరెక్టర్ రోహిత్ మిట్టల్ ని 2018లో లవ్ మ్యారేజ్ చేసుకుంది. లైఫ్ లో సెటిల్ అయ్యింది అనుకుంటే.. పెళ్లైన ఎనిమిది నెలలకే ఈ జంట విడాకులు తీసుకున్నారు.
ఇటీవల ఈ విడాకుల గురించి శ్వేతాబసు ప్రసాద్ స్పందిస్తూ.. ఇద్దరం ఒకరినొకరం మాట్లాడుకునే విడాకులు తీసుకున్నాం. లైఫ్ లో ఏదీ కూడా అనుకున్నట్టుగా జరగదు. అలాగే కావాలని ఎవరూ విడిపోరు. అయితే.. ఎనిమిది నెలల తర్వాత విడిపోయాం కాబట్టి దీనికి విడాలకు అని పెద్ద మాటలు కరెక్ట్ కాదు. ఇది ఒక బ్రేకప్ లాంటిది అంటుంది. అయితే.. రోహిత్ తో విడిపోయిన తర్వాత చాలా బాధపడ్డాను అని చెప్పింది. ప్రస్తుతం వెబ్ సిరీస్ లోను, అలాగే హిందీ సీరియల్స్ లోను నటిస్తోంది.
Must Read ;- అందాలతో మత్తెక్కిస్తున్న ఈ సుందరి ఎవరో తెలుసా?











