రెబల్ స్టార్ ప్రభాస్ .. బాహుబలి తర్వాత పూర్తిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడు అతడితో సినిమా తీయాలంటే.. మినిమమ్ రూ. 300కోట్లు బడ్జెట్ పెట్టాల్సిందే. ఆ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో బహుభాషల్లో విడుదల చేయాల్సిందే. ప్రస్తుతం ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాను, ‘సలార్’ పాన్ ఇండియా చిత్రాల్ని విడుదలకు సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఈ రెండు సినిమాల విడుదల తేదీల్లో మార్పులు రావచ్చు. ఇక ఆదిపురుష్ మూవీని కూడా పాన్ ఇండియా కేటగిరిలోనే విడుదల చేయబోతున్నారు.
ఇక ప్రభాస్ ఈ మూడు మూవీస్ తో పాటు .. బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ సిద్ధార్ధ్ ఆనంద్ తో కూడా ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. బ్యాంగ్ బ్యాంగ్ , వార్ లాంటి సినిమాలతో హిట్స్ సొంతం చేసుకున్న ఈ దర్శకుడు .. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ హీరోగా ఒక సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇందులో ప్రభాస్ కు జోడీగా కత్రినా కైఫ్ ను ఎంపిక చేయబోతున్నట్టు తెలుస్తోంది.
ప్రభాస్ ప్రస్తుతం చేస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కోసం వరుసగా బలీవుడ్ బ్యూటీస్ ను రంగంలోకి దింపుతున్నారు మేకర్స్. ఆల్రెడీ నాగ్ అశ్విన్ దర్శకత్వంలోని సినిమా కోసం దీపికా పదుకొణేను కథానాయికగా సెలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే.. ఆదిపురుష్ లో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడు కత్రినా కైఫ్ ను కూడా ప్రభాస్ కు జోడీగా దింపుతున్నారు మేకర్స్ . ఇదంతా పాన్ ఇండియా స్థాయి ప్లానే అని అర్ధమవుతోంది. మరి ప్రభాస్ కోసం ఇంకెంత మంది బాలీవుడ్ బ్యూటీస్ రంగంలోకి దిగుతారో చూడాలి.
Must Read ;- అల్లు అర్జున్ కరోనా పాజిటివ్.. ఐసోలేషన్ లో ప్రభాస్










