(తిరుపతి నుంచి లియోన్యూస్ ప్రత్యేకప్రతినిధి)
అఖిలాండ బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వేంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది ఇది ఏ విధంగా నిర్వహించాలనే విషయమై తి.తి.దే తర్జనభర్జన పడుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలను ఏ విధంగా నిర్వహించాలో ఆగమ పండితులు, జియ్యంగార్ల సలహాలను తీసుకుంటోంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా కరోనా కారణంగా తిరుమలలోని శ్రీవారి ఆలయం లోకి దాదాపు రెండున్నర నెలలపాటు భక్తులను అనుమతించని విషయం తెలిసిందే. ఈ సమయంలో శ్రీవారికి కైంకర్యాలను ఏకాంతంగా నిర్వహించారు. తర్వాత కోవిడ్ నిబంధనలను పాటిస్తూ భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. అయితే అయితే వచ్చే నెల 17వ తేదీ నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగ నున్నాయి. గతంలోవలె బ్రహ్మోత్సవాలను వైభవంగా మాడ వీధులలో నిర్వహించే విషయమై తితిదే విస్తృతంగా చర్చలు జరుపుతోంది.
పరిమిత సంఖ్యలో భక్తులను మాడ వీధులలో అనుమతించి శ్రీవారి ఉత్సవమూర్తులనుఊరేగించే అంశాన్ని పరిశీలిస్తోంది. దీంతోపాటు రంగనాయక మండపంలో ఏకాంతంగా ఉత్సవాలను నిర్వహించే ఈ విషయాన్ని అధికారులు ఆలోచిస్తున్నారు. ఆగమ పండితులు తోపాటు జిఎం గార్ల సలహాలను తీసుకుంటున్నారు.
అన్ని అంశాలను ఈనెల 28 వ తేదీన జరిగే తితిదే బోర్డు సమావేశంలో సభ్యుల ముందు ఉంచనున్నారు. అంతిమ నిర్ణయం బోర్డు తీసుకోనుంది. ఇదిలా ఉండగా ఈ ఏడాది అధికమాసం కారణంగా అక్టోబరు నెలలోనూ శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో లో సెప్టెంబరు నెలలో ఏకాంతంగా నిర్వహించి, అక్టోబర్లో పరిమిత సంఖ్యలో భక్తులను మాడ వీధులలో అనుమతించి శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారు. వచ్చే నెలలో నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలు ఎలా నిర్వహిస్తారో రెండు రోజుల్లో తేలిపోనుంది.